Advertisement
Google Ads BL

రకుల్ కు ఆయన అంటే చాలా ఇష్టం..!


టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే దానికి అర్ధం చెప్పేస్తుంది. ఆగష్టు ఆరు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రకుల్ తన ఫ్రెండ్స్ గురించి తానేం అనుకుంటుందో చెప్పేసింది. తన ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని..... వారిలో తనకి మంచి ఫ్రెండ్ మాత్రం కె రాఘవేంద్ర రావు గారి అబ్బాయి ప్రకాశ్ కోవెలమూడి తనకు అత్యంత సన్నిహితుడు మాత్రమే కాకుండా ఆయనంటే తనకి చాలా ఇష్టమని చెప్పడమే కాదు.... తనకి బాయ్ ఫ్రెండ్ దొరికితే మాత్రం ప్రకాష్ దగ్గరికే ట్రైనింగ్ కి పంపుతానని చెబుతుంది.

Advertisement
CJ Advs

ప్రకాష్ దగ్గరికి ముందుగా ట్రైనింగ్ కి పంపుతానని చెబుతున్న రకుల్ అక్కినేని అఖిల్ మాత్రం తనకి ఒక తమ్ముడులాంటోడని..... తన వయసు చూస్తుంటే తనకి తమ్ముడిలాగే అనిపిస్తుందని చెబుతుంది. అలాగే అఖిల్ ని తన డార్లింగ్ అని అనడమేకాదు.... అఖిల్ చాలామంచోడని కితాబునిచ్చేస్తుంది. ఇక రవితేజ ని మాత్రం రవిగారు అని పిలుస్తానని చెప్పిన రకుల్, నేచురల్ స్టార్ మాత్రం చాలా డెడికేటెట్ అంటూనే సిన్సియర్ అని కూడా చెబుతుంది.

ఇక రానా మంచి హోస్ట్ అని... అలాగే హీరోయిన్ రాసి  ఖన్నా చాలా  సైలెంట్ గా ఉంటుందని, మంచు లక్ష్మి మాత్రం తనకి అమ్మలాంటిదని..... అన్ని విషయాల్లో  చాలా కేర్ తీసుకుంటుందని రకుల్ ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ గురించి వివరించేసింది.

Rakul Preet Singh About Tollywood Industry Friends:

Tollywood star heroine Rakul Preet Singh yesterday About film industry friends.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs