ఆగష్టు 11 న కూల్ గా బరిలోకి దిగుతున్న జోగేంద్ర హడావిడి ఎక్కువైంది. పబ్లిసిటీ స్టెంట్ ని కూడా వెరైటీ గా మొదలుపెట్టిన 'నేనే రాజు - నేనే మంత్రి' జోగేంద్రగా రానా పంచెకట్టుతో స్టైలిష్ గా కనబడుతూ భీభత్సం చేసేస్తున్నాడు. రీసెంట్ గా మా టీవీలో స్టార్ట్ అయిన బిగ్ బాస్ షోలో రానా, జోగేంద్ర గా హడావిడి చేసి తన సినిమాకి మంచి ప్రమోషన్ చేసేశాడు. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ హౌస్ లోకి ఎంటర్ అయిన జోగేంద్ర అక్కడ బిగ్ బాస్ పార్టిసిపేట్స్ తో కలిసి హంగామా సృష్టించాడు. అక్కడ పార్టిసిపేట్స్ తో టాస్క్ లు చూపిస్తూ తన సినిమాని ప్రమోట్ చేసేసుకున్నాడు.
అక్కడ వాళ్ళ మధ్యలో పంచెలో కూర్చున్న జోగేంద్ర గెటప్ లో రానా సూపర్బ్ గా ఆకట్టుకోవడమే కాదు అందరిని బాగా ఎంటర్టైన్ చెయ్యడమే కాదు అక్కడ హోస్ట్ గా చేస్తున్న ఎన్టీఆర్ తో కలిసి అల్లరల్లరి చేసి సెటైరికల్ డైలాగ్స్ పేలుస్తూ సూపర్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. అలాగే ఎన్టీఆర్, రానా ని ఉద్దేశించి 'నేనే రాజు - నేనే మంత్రి' నువ్వే కంత్రి అంటూ ఆట పట్టించి బిగ్ బాస్ సెట్స్ మీద నవ్వులు పూయించారు ఎన్టీఆర్.
ఇక చివరిగా రానా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్స్ ని ఎలిమినేట్ చెయ్యాల్సి వచ్చినప్పుడు..... నాకింతటి సదావకాశం ఇచ్చి మరి పార్టిసిపేట్స్ తో చంపిచ్చేద్దామని బాగా ప్లాన్ చేశారు అంటూ రానా అనగా దానికి ఎన్టీఆర్ మాత్రం ఖచ్చితంగా మీరు ఒకరి ఎలిమినేషన్ పేరును తీయాల్సిందే అని చెప్పగా దానికి రానా సమీర్ పేరు చెప్పాడు. దీనితో సమీర్ బిగ్ బాస్ హౌస్ ని వదిలేసి వెళ్ళిపోయాడు. మరి రానా, జోగేంద్రగా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఎన్టీఆర్ అభిమానులని కూడా 'నేనే రాజు - నేనే మంత్రి' సినిమాను చూసి ఎంజాయ్ చేయమని చెప్పగా ఎన్టీఆర్ మాత్రం నా అభిమానులేమిటి తెలుగు ప్రేక్షకులందరూ ఈ సినిమా చూస్తారంటూ రానాని వేదిక మీద నుండి సాదరంగా పంపించేశాడు. ఇక ఎన్టీఆర్ ఎనర్జీతో బిగ్ బాస్ షో ఎప్పటిలాగే సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది.