బోయపాటి శ్రీను - బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన 'జయ జానకి నాయక' చిత్రం ఈ నెల 11 నే విడుదలకు సిద్దమయ్యింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఒక కుర్ర హీరో పక్కన నటించండం.... ఒక ఎత్తైతే... మాస్ డైరెక్టర్, టాప్ డైరెక్టర్ బోయపాటి ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యడం కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే పెంచింది. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా కొంచెం రొమాంటిక్.... మరి కొంచెం మాస్ మసాలా తో తెరకెక్కింది. బోయపాటి మీద ఉన్న నమ్మకంతో మేకర్స్ రెండు గట్టి సినిమాలతో పోటీకి సిద్ధమయ్యారు.
రానా హీరోగా వస్తున్నా 'నేనే రాజు - నేనే మంత్రి' సినిమాతో ఆగష్టు 11 న బరిలోకి దిగుతుంది. అలాగే నితిన్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 'లై' సినెమా కూడా అదేరోజు విడుదలవుతుండడంతో మూడు సినిమాలకు గట్టి పోటీ ఏర్పడింది. మరి బోయపాటి క్రేజ్ సినిమా కలెక్షన్స్ మీద ప్రభావం చూపాలంటే గనక సినిమా 'సరైనోడు' రేంజ్ లో హిట్ కావాల్సి ఉంటుంది. మరో పక్క రెండు సినిమాలు గట్టి సినిమాలే కావడంతో ఖచ్చితంగా సినిమా మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక జయ జానకి నాయకలో ముగ్గురు హీరోయిన్స్ గ్లామర్, వారి యొక్క హొయలుతో సినిమా మీద అంచనాలే ఏర్పడ్డాయి.
రకుల్ అందాలు, ప్రగ్య జైస్వాల్ సొగసులు, కేథరిన్ తడిచిన అందాలు ఇన్ని ఉన్న సినిమాలో కంటెంట్ కూడా కరెక్ట్ గా ఉంటే సినిమా హిట్టవుతుంది. అయితే మూడు సినిమాలు ఒకే రోజు విడుదలయితే సినిమాల టాక్ ఎలా వున్నా సినిమా కలెక్షన్స్ మాత్రం పడిపోతాయి. అందుకే 'జయ జానకి నాయక' మేకర్స్ తో పాటే బోయపాటి కూడా ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుకు జరపాలనే ప్లాన్ లో ఉన్నారట. ఆగస్ట్ 11న రిలీజ్ కావాల్సిన 'జయ జానకి నాయక' సినిమాని ఆగస్ట్ 10కి ప్రీపోన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. అంటే ఒక రోజు ముందుగానే 'జయ జానకి నాయక'ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు బోయపాటి ప్లాన్ చేశాడు.
ఇలా ఒకరోజు ముందే సినిమా విడుదలైతే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చి మొదటి రోజు కలెక్షన్స్ బావుంటాయని అంటున్నారు. ఇక మొదటి రోజు ముందే టికెట్స్ బుక్ అవడంతో సినిమా టాక్ ఎలా వున్నా ఫస్ట్ డే కలెక్షన్స్ అదిరిపోతాయి. ఇక రెండో రోజు 'లై, నేనే రాజు నేనే మంత్రి'ఎలాగూ వస్తుండడంతో వాటితో పోటీ పడినట్లు ఉంటుంది.... మొదటి రోజు గట్టిగా పీకెయ్యొచ్చనే ఆలోచనలో చిత్ర టీమ్ ఉందన్నమాట.