Advertisement
Google Ads BL

ప్రమోషన్స్‌ వేగం పెంచుతున్నారు...!


స్టార్‌ హీరోలకే ఈ రోజుల్లో థియేటర్ల వద్దకు ప్రేక్షకులను రప్పించడానికి ప్రమోషన్లు తప్పడం లేదు. అభిమానులు ఎలాగూ మొదటి మూడు రోజులు సినిమా ఎలా ఉన్నా హంగామా చేస్తారు. కాని శుక్రవారం విడుదలైన చిత్రం ఆదివారం వరకు ఓకే గానీ సోమవారం నుంచి పరిస్థితి తేలిపోతుంది. దాంతో సినిమా ప్రమోషన్‌ విషయంలో బాగా అనుభవం ఉన్న దగ్గుబాటి సురేష్‌బాబు, రానాలు కూడా తమ వంతు ప్రమోషన్‌పై దృష్టిపెడుతూ ఉంటారు. 'ఘాజీ'కి ఈ ప్రమోషన్‌ బాగా హెల్ప్‌ అయింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా దాదాపు దశాబ్దకాలంగా హిట్‌ లేని తేజతో 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం చేస్తుండటంతో తేజని చూసి థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. కానీ టీజర్‌, ట్రైలర్‌లో చూపిన కంటెంట్‌, రానాతో పాటు రాధగా నటిస్తున్న కాజల్‌, రాణిగా నటిస్తోన్న కేథరిన్‌లను కూడా ఖచ్చితంగా ప్రమోషన్‌లో పాల్గొనాలని సురేష్‌బాబు నిర్ణయించాడు. తాజాగా తేజతో కలసి రాధ, రాణి కలిసి ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో సందడి చేస్తోంది. 

ఇక ఆల్‌రెడీ తమిళంలో కూడా బాగా ప్రమోట్‌ చేస్తూ, రిసార్ట్స్‌ పదాన్ని బాగా వాడుతున్నారు. ఇక బాలీవుడ్‌లో తమ సినిమా రిలీజ్‌కి దానికి తగ్గ పని ఏదైనా ఉంటే అది పొలిటికలా? లేక బిగ్‌బాస్‌ షోనా? అనేది కూడా పట్టించుకోరు. వచ్చేసి ఆ షోకి, పొలిటికల్‌ మీటింగ్‌లకు గ్లామర్‌ టచ్‌ ఇచ్చి, వారికి ఉపయోగపడుతూ, తాము లబ్ది చూసుకుంటారు. గతంలో ఎన్నోసార్లు హిందీ బిగ్‌బాస్‌ షోకి సినిమా విడుదల సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. కి యూపి సీఎం చేపట్టిన స్వచ్చభారత్‌, టాయిలెట్‌ ప్రచారాన్ని తమ 'టాయిలెట్‌' సినిమా పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. దాంతో రానా బిగ్‌బాస్‌ షోకి మొదటి బిగ్‌ సెలబ్రిటీగా హాజరుకానున్నాడు. 

మరోపక్క హైదరాబాద్‌లో ప్రారంభించిన మొక్కలు నాడే కార్యక్రమమైన హరితహారంకి కూడా రానా సినిమా గెటప్‌లోనే కేథరిన్‌తో వచ్చి మొక్కలు నాటి తన వంతు ప్రమోషన్‌ని పొండానికి ట్రై చేశాడు. పోయే కొద్ది ఈ ప్రమోషన్ల వేగంను మరింత పెంచాలని టీం భావిస్తోంది.

Nene Raju Nene Mantri Movie Update:

Rana and Kajal starring movie 'Nene Raju nene Mantri' Director by Tej and Producer Suresh babu. This Movie Unit  Promotions Speed grow up side.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs