నితిన్ హీరోగా సినిమా అంటే పవన్ వస్తాడనేది అందరు ముందుగా ఊహించుకునే విషయం. ఇక నితిన్ తర్వాతి చిత్రాన్ని ఎలాగూ పవన్, త్రివిక్రమ్‌లు నిర్మిస్తున్నారు. కానీ 'లై' వేడుకకు పవన్ రాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని పంపాడు. అంటే నితిన్ కోసం పవన్ తరపున త్రివిక్రమ్ వచ్చినట్లుగానే భావించాలి. ఇక 14రీల్స్ సంస్థలో మహేష్‌బాబు మూడు చిత్రాలు చేశాడు. 'దూకుడు' ఒక్కటే దూకుడు చూపిస్తే, '1' (నేనొక్కడినే), ఆగడు'లు 'దూకుడు' లాభాలను మించేలా 14 రీల్స్ సంస్థకు నష్టాలు తెచ్చాయి.
ఇక 14రీల్స్ సంస్థ గతంలో నాని హీరోగా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రం వేడుకకి మహేష్ హాజరయ్యాడు. దాంతో ఆయనైనా 'లై' వేడుకకి వస్తాడని భావించారు. కానీ ఆయన రాలేదు. కానీ '1' (నేనొక్కడినే) తీసిన సుకుమార్ వచ్చాడు. ఇలా అటు హీరో నుంచి ఇటు నిర్మాతల నుంచి అసలు వారు రాకపోయినా కొసరువారు మాత్రం వచ్చారు. ఇక ఈ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు.
సుకుమార్ మాట్లాడుతూ, దర్శకులు రెండు రకాలు, ఒకరు సెట్‌లో డైరెక్ట్ చేసేవారైతే, మరోకరు ఎడిటింగ్‌రూమ్‌లో చేసేవారు అనిసెటైర పేల్చాడు. ఇక త్రివిక్రమ్ దానికి కొనసాగింపుగా మూడో రకం డైరెక్టర్లు కూడా ఉంటారు. సినిమా మొత్తం పూర్తయి, విడుదలైన తర్వాత ఈ రకంగా కాకుండా వేరే రకంగా తీసుంటే బాగుండేది అని ఆలోచించేవారుంటారు. దానిలో నేను ఉన్నాను.. అని చెప్పి తనపై తాను జోక్స్ వేసుకునే పరిణతి తనకి ఉందని త్రివిక్రమ్ నిరూపించుకున్నాడు.!