Advertisement
Google Ads BL

చడీ చప్పుడు లేకుండా వచ్చేస్తున్నాడు..!


నాడు ఈటీవీ ప్రభాకర్‌గా గుర్తింపు తెచ్చుకుని, ఈటీవీ సుమన్‌కి ఆప్తుడుగా ఉండి, రామోజీరావు దెబ్బకు బయటకు వచ్చిన ప్రభాకర్‌ చిన్నోడుకాదు.. ఎవరిని ఎక్కడ నొక్కాలో? ఎక్కడ స్విచ్‌ వేస్తే ఎక్కడ వెలుగుతుందో ఆయనకి బాగా తెలుసు. ఇక తన తోటి యాంకర్‌, హోస్ట్‌ డైరెక్టర్‌గా అవతారం ఎత్తగా లేనిది తనకేం తక్కువ అని ఏకంగా అల్లు అరవింద్‌నే లైన్లో పెట్టాడు. ఇక గీతాఆర్ట్స్‌ 2తో పాటు యువి క్రియేషన్స్‌, తమిళంలో బిగ్‌ బ్యానర్‌ అయిన స్టూడియో గ్రీన్‌ సంస్థలతో పాటు వీ4 మూవీస్‌ బేనర్‌లో ఎప్పుడు మొదలుపెట్టాడో ఎప్పుడు పూర్తి చేశాడో తెలియకుండా షూటింగ్‌ పూర్తి చేశాడు. 

Advertisement
CJ Advs

చిత్రం టైటిల్‌ 'నెక్ట్స్‌ నువ్వే'. ఇందులో వైభవితో పాటు యాంకర్‌ రేష్మిలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉందట. త్వరలో విడుదలకు ముస్తాబు చేస్తున్నారు. ఒకవైపు ఎన్టీఆర్‌ 'జై లవ కుశ', మహేష్‌ బాబుల 'స్పైడర్‌'లకు పోటీగా సందిట్లో సడేమియా అన్నట్లుగా దసరా బరిలోనే దించుతున్నారు. ఇక గీతాఆర్ట్స్‌ ఉండటంతో థియేటర్లకు కొదువేమీ ఉండదు. ప్రతి ఏరియాలోనూ థియేటర్లు లభిస్తాయి. టీజర్లు, ట్రైలర్ల సందడి లేకుండా ఏకంగా సినిమా రిలీజ్‌ డేట్‌ని లాక్‌ చేయడం చూస్తే ఈచిత్రం ద్వారా అల్లు అరవింద్‌ కొత్త ట్రెండ్‌కి తెరతీస్తున్నాడా? అనే అనుమానం వస్తుంది. 

ఆయన గతంలో ఆడియో వేడుకల స్థానంలో ప్రీరిలీజ్‌ ఈవెంట్ల ట్రెండ్‌ని తెచ్చాడు. మరి ఈ చిన్న చిత్రాన్ని ఆయన కొత్త రకమైన పంధాలో ప్రమోట్‌ చేసి కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడుతున్నాడనే మాట వినిపిస్తోంది. మరి ఆ వినూత్న పంధా ఏమిటో ఎదురు చూడాల్సివుంది..! ఇక ఓంకార్‌ 'రాజు గారి గది' ద్వారా తనను తాను ప్రూవ్‌ చేసుకుని, ఏకంగా నాగార్జున - సమంతలతో 'రాజుగారి గది 2'ని పివిపి బేనర్‌లో చేస్తున్న ఓంకార్‌ పంథాలోనే ఈ చిత్రం హిట్టయితే అల్లు అరవిందే నమ్మగా లేనిది ప్రభాకర్‌ని పెద్ద హీరోలు కూడా ప్రభాకర్‌పై నమ్మకం పెంచుకోవడం ఖాయమనే చెప్పాలి...! 

Next Nuvve Movie Update!:

Aadi Sai Kumar new movie'Next Nuvve' Release Update.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs