Advertisement
Google Ads BL

చరణ్ కి లవ్ స్టోరీలంటే అంత భయమా..?


వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఫిదా' చిత్రం సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తూ కలెక్షన్స్ దుమ్ము దులుపుతుంది. గత శుక్రవారం థియేటర్స్ లోకొచ్చిన సినిమాలేవీ హిట్ టాక్ తెచ్చుకోకపోయేటప్పటికీ 'ఫిదా' చిత్రం ఇంకా కలెక్షన్స్ వర్షం కురిపిస్తూనే వుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ వచ్చిన 'ఫిదా' చిత్రం హిట్ అయినప్పటికీ ఈ హిట్ క్రెడిట్ మొత్తం హీరోయిన్ సాయి పల్లవి కే దక్కింది. 'ఫిదా' లో హీరోయిన్ రోల్ కి అంత ఇంపార్టెంట్ ఉండబట్టే హీరోగా నటించిన వరుణ్ తేజ్ పేరు హిట్ లిస్ట్ లో ఎక్కడా కనబడలేదు. అయినా కూడా వరుణ్ కెరీర్లోనే భారీ హిట్ ఫిదానే.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్ర కథ రెడీ అయినప్పుడు శేఖర్ కమ్ముల మాత్రం ఈ 'ఫిదా' కథతో ఒక స్టార్ హీరోతో మాత్రమే సినిమా చేయాలనుకుని దిల్ రాజు సహాయంతో మహేష్ బాబు కి 'ఫిదా' స్టోరీ వినిపించగా.. కథ విన్న మహేష్ ఇలాంటి రొమాంటిక్ స్టోరీ కి తాను సూట్ అవ్వనని సున్నితంగా తిరస్కరించడంతో... అదే కథతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలవగా... కథ విన్న చరణ్ ఇంత రొమాంటిక్ కథ చెయ్యడానికి ప్రస్తుతం తాను సిద్ధంగా లేనని.... ఇప్పుడున్న తన ఇమేజ్ కి ప్రేమ కథలు నచ్చవని..... ఒకసారి 'ఆరెంజ్' వంటి ప్రేమకథలో నటించి దెబ్బతిన్నానని .... అందుకే ఇప్పట్లో  అలాంటి లవ్ స్టోరీలో నటించి  తన మాస్ ఇమేజీని వదులుకోలేనని... చెప్పడమే కాకుండా ఈ స్టోరీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వరుణ్ కైతే బావుంటుందని... తన కజిన్ అయిన వరుణ్ తేజ్ పేరుని రికమెండ్ చెయ్యడంతో ఈ 'ఫిదా' స్టోరీ అటుతిరిగి ఇటుతిరిగి వరుణ్ చేతికి రావడమే కాదు ఆ సినిమా ఇప్పుడు వేయినోళ్ల కొనియాడుతున్నారు.

అసలు 'ఫిదా' స్టోరీ నచ్చడంతోనే చరణ్ అలా వరుణ్ పేరుని ప్రిఫర్ చేశాడు. మరి ఆ సినిమాలో చరణ్ గనక నిజంగా నటించినట్టైతే ఆ సినిమా హిట్ చరణ్ ఖాతాలోనే ఉండేది. ఒకటే ఫ్యాషన్ ని ఫాలో అవుతూ ప్రయోగాలకు హీరోలు దూరంగా ఉన్నంతసేపు ఇలాంటి ఆటుపోట్లు వచ్చిపోతూనే ఉంటాయి మరి.ఏది ఏమైనా రామ్ చరణ్ మాత్రం చేజేతులారా ఫిదా హిట్ ని కావాలనే కాలదన్నుకున్నాడనేది మాత్రం అక్షర సత్యం. 

Ram Charan Told Name Varun For Fidaa Movie:

Varun Tej and Sai Pallavi Acted and Super hit movie 'Fidaa'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs