Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్ కి ప్రియుడు కావాలంట!


తెలుగులో ప్రస్తుతం ఉన్న స్టార్‌ హీరోయిన్లలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒకరు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న మహేష్‌ బాబు-మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రెస్టీజియస్‌ మూవీ 'స్పైడర్‌'లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అదే సమయంలో ఆమె బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో నటిస్తున్న 'జయ జానకి నాయకా' చిత్రం ఆగష్టు11న విడుదల కానుంది. 

Advertisement
CJ Advs

ఈ రెండు చిత్రాలు అతి తక్కువ గ్యాప్‌లోనే విడుదల కానుండటం విశేషం. ఇక సాయి పల్లవి, కీర్తి సురేష్‌ వంటి వారు తనకు తాను వారిని పోటీగా భావించనని, తానే నెంబర్‌వన్‌ని అంటోంది. తెలుగులో మొదటి చిత్రం చేసే రోజున నాకు తెలుగు అసలు తెలియదు. భాష రాక, తెలుగు అర్ధం కాక ఏడ్చేశాను. ఇప్పుడు నేనున్న స్థితి గాలి వాటుగా రాలేదు. దీని వెనుక నా కఠోరమైన కృషి ఉంది. ఇక డ్రగ్స్‌ కేసును చూస్తుంటే ఎక్కడో సమాజంలో జరిగిన దొంగతనాల గురించి మమల్ని ఇంటరాగేషన్‌ చేస్తున్నట్లుగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది. 

సినిమా వారిలో డ్రగ్స్‌ వాడే వారెవ్వరూ లేరని, సినిమా వారి మీద పడితేనే ప్రజలు ఆసక్తిచూపుతారని భావించి తమను టార్గెట్‌ చేస్తున్నారంటోంది. ఇక అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా తనకు వచ్చిన ప్రపోజల్స్‌ చాలా తక్కువేనని, ఒకరిద్దరు ట్రై చేసినా వర్కౌట్‌ కాలేదు. పెద్దలు చూసిన పెళ్ళి చేసుకోను. ఖచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటాను. నన్ను చేసుకునేవాడికి సినిమాలంటే ఇష్టం ఉండాలి. 

పొడవుగా ఉండి, మంచి భోజన ప్రియుడు అయి ఉండాలి. నీలో నాకిది నచ్చలేదు.. అది నచ్చలేదు అంటే ఒప్పుకోను. ఇక మహిళలు సమాజంలో ఉన్న పురుషాధిక్యం వల్ల కొన్ని విషయాలలో సర్దుకుపోవాలి. కానీ నా జీవితాన్ని శాసించాలని ఎవరైనా చూస్తే చెప్పుతీసుకుని కొడతా.. అంటూ అమ్మడు పెద్ద పెద్ద మాటలే వల్లె వేస్తోంది. 

 

Rakul Preet Singh Want Love Marriage!:

Rakul Preet Singh talk about Tollywood celebrities drugs case and be my life patner.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs