Advertisement
Google Ads BL

ప్రభాస్ చెప్పేశాడు తన పెళ్ళి గురించి..!


ప్రస్తుతం తెలుగులో ఉన్న మోస్ట్‌ డిజైరబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరు అంటే ఠక్కున అందరూ బాహుబలి ప్రభాస్‌ పేరే చెబుతారు. దేశవ్యాప్తంగా కూడా ఈయన పెళ్ళి పై పలు వార్తలు వస్తున్నాయి. ఇక తన పెళ్ళి విషయంలో వస్తున్న వార్తలపై ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చాడు. తన పెళ్లి గురించి తాను గానీ, తన కుటుంబ సభ్యులు గానీ ఆలోచించడం లేదని, మరో ఏడాది వరకు ఆ ప్రస్తావనే లేదని చెప్పేశాడు. తమ కంటే తన అభిమానులు, ముఖ్యంగా మహిళా అభిమానులే ఎక్కువగా తన పెళ్ళి గురించి ఆందోళన చెందుతున్నారని, వారు అంతటి ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ఆనందంగా ఉందని, ప్రస్తుతం తన దృష్టి మొత్తం 'సాహో' చిత్రం పైనే అని తెలిపాడు. 

Advertisement
CJ Advs

ఇక అనుష్కను ప్రభాస్‌ పెళ్ళి చేసుకోనున్నాడని వార్తలు వచ్చాయి. ప్రభాస్‌ అభిమానులు కూడా ఈ జంట చూడముచ్చటగా ఉంటుందని భావించారు. దానిపై అనుష్క మండిపడి అలాంటి వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించింది. మరో వైపు హీరో రానా ప్రభాస్‌కి పెళ్ళి కూతురు కావాలని అనే ప్రకటన చేశాడు. దీని గురించి ప్రభాస్‌ మాట్లాడుతూ, రానా క్రియేటివిటీకి ఇది అద్దం పడుతుంది. నేను నా పెళ్ళి చేసుకుంటానని రానాకి చెప్పలేదు. ఆయన కూడా నేను పెళ్ళి చేసుకుంటున్నాననే ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన తమషాగా ఇది చేశాడు. 

ఇక నా కెరీర్‌ మొదట్లో ఇలాంటి రూమర్లు వస్తే బాధపడేవాడిని, కానీ తర్వాత పట్టించుకోవడం మానేశాను. సినీ సెలబ్రిటీల విషయంలో ఇదికామనే. ఎవరైనా రెండుమూడు చిత్రాలలో కలసి నటిస్తే ఇలాంటివి సర్వసాధారణంగా వస్తుంటాయి. ఆధారాలు లేకుండా ఇలాంటివి రాయడం మంచిది కాదని ముందు భాదించినా ఇప్పుడు పట్టించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చేశాడు. సో ప్రభాస్‌ 'సాహో' విడుదలయ్యే వరకు పెళ్ళి గురించి ఆలోచించనని చెప్పి రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. 

Prabhas Gived Clarity on Marriage!:

Hero Prabhas Recently gives clarity on Marriage rumors.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs