Advertisement
Google Ads BL

'అర్జున్ రెడ్డి' అదిరిందంటున్న నేచురల్ స్టార్!


'పెళ్ళి చూపులు' సినిమాతో ఒక్కసారిగా ఫెమస్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో విజయ్ నేచురల్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత  విజయ్ చేసిన సినిమాలు 'ద్వారకా' సినిమా కొద్దిగా నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు మళ్లీ 'అర్జున్ రెడ్డి' అనే సినిమాతో రఫ్ లుక్ లో వచ్చేస్తాడు. ఈ సినిమా టీజర్ తో కాస్త హడలుపుట్టించినప్పటికీ ఇప్పుడు తాజాగా థియేట్రికల్ ట్రైలర్ తో స్మూత్ గా వచ్చేశాడు. ఆ ట్రైలర్ లో 'అర్జున్ రెడ్డి' లుక్ లో విజయ్ దేవరకొండ బాగా సెట్ అయ్యాడు. ట్రైలర్ లో చూసిన స్టోరీ కాస్త రొటీన్ గా ఉన్నప్పటికీ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా వుంది. 

Advertisement
CJ Advs

అయితే ఈ ట్రైలర్ చూసిన విజయ్ ఫ్రెండ్.... 'ఎవడే సుబ్రహ్మణ్యం' లో విజయ్ తో కలిసి నటించిన  నాచురల్ స్టార్ నాని 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ ని చూసి ఈ ట్రైలర్ ని ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు నేను సినిమా మూడ్ లోకి వెళ్లిపోయాయనని చెబుతున్నాడు. ఇలాంటి సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు నాని,'అర్జున్ రెడ్డి' నిర్మాతలకు థాంక్స్ కూడా చెప్పాడు. అసలు నాని కి ఈ ట్రైలర్ లో అంతగా నచ్చింది ఏమిటంటే  ‘అర్జున్ రెడ్డి’ థియేట్రికల్ ట్రైలర్ చాలా టెర్రిఫిక్ గా ఉందని... అలాగే చాలా షాకింగ్ గానూ ఉంది. అసలు మనం మన తెలుగు సినిమాల్లో వచ్చిన మార్పు ఇప్పుటికే చూస్తున్నాం. ఈ 'అర్జున్ రెడ్డి' సినిమా  దాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందనుకుంటున్నా....అంటూనే  అసలు విజయ్ గురించి ఎవరు మాట్లాడినా.. విజయ్ బాగా చేస్తున్నాడని అన్నా నాకు ఒకరకమైన గర్వంగా ఉంటుందని నాని చెబుతున్నాడు.

మరి తన సినిమాలో కీ రోల్ చేసి ఆతర్వాత హీరోగా ఎదిగిన విజయ్ ని నాని అందులోను వరుస విజయాలతో దూసుకుపోతున్న టైం లో ఇలా ఒక సినిమా గురించి పొగడడం అంటే మాములు విషయం కాదు. ఇక సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడిన నాని ఈ మధ్య సినిమాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే.... అసలు ఒక ట్రైలర్ చూసి సినిమా చూడాలా వద్దా అని డిసైడవుతున్నాం.కాకపోతే  సినిమాకు వెళ్లాక మన ఫోన్లు.. ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి సినిమాలో లీనం కావడానికి ఇంటర్వెల్ వరకు సమయం పడుతుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రం క్లైమాక్స్ దగ్గర లీనమవుతాం. అదే కొన్ని సినిమాలు ఉన్నాయి అంటే సినిమా ఎంతసేపు చూసిన అస్సలు అర్ధంకాని పరిస్థితి.... కానీ విజయ్ అర్జున్ రెడ్డి ట్రైలర్ చూస్తుంటే మాత్రం మనం వెంటనే సినిమా మూడ్ లోకి వెళ్ళిపోతాం. ఇది కేవలం ఇప్పటి కాలంలో 'అర్జున్ రెడ్డి' విషయంలోనే జరిగిందని.... 'అర్జున్ రెడ్డి' ట్రైలర్ ని ఆకాశానికెత్తేశాడు హీరో నాని.

Nani About Arjun Reddy Movie Trailer:

Natural star Nani Speaking about Vijay Devarakonda acting movie 'Arjun Reddy'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs