'నేను శైలజ' చిత్ర దర్శకుడితో రామ్ మరొక్కసారి చేస్తున్న చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజు అనుపమ పరమేశ్వరన్ తో పాటు ప్రస్తుతం నితిన్ 'లై' సినిమాలో చేస్తున్న మేఘ ఆకాష్ కూడా హాజరయ్యింది. ఫస్ట్‌లో అనుపమ, మేఘ ఆకాష్‌లు ఈ చిత్రానికి హీరోయిన్లు అని తెలిపారు. కానీ తాజాగా చిత్ర టైటిల్‌తో పాటు రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి అని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
మరి ఓపెనింగ్‌కి వచ్చిన మేఘ ఆకాష్ ఏమైంది? రామ్ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది? అంటే దీనికి కారణం నితిన్ అని తెలుస్తుంది. నితిన్ అంటే కావాలని నితినే, మేఘని ఈ సినిమాలో చేయకుండా చేశాడని మాత్రం అనుకోవద్దు. కారణం నితిన్ కాదు కానీ, నితిన్ సినిమా 'లై' అని తెలుస్తుంది. రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రం కోసం మేఘ ఆకాష్ డేట్స్, 'లై' చిత్రం కోసం మేఘ ఆకాష్ డేట్స్ క్లాస్ అవుతుండటంతో..ముందుగా మొదలైన 'లై'ని కాదనలేక రామ్ సినిమా నుండి మేఘ ఆకాష్ తప్పుకుందట.
ఇదిలా ఉంటే రామ్ సినిమా నుండి మేఘ ఆకాష్ తప్పుకోవడానికి కారణం ఆమెను రెండో హీరోయిన్‌గా తీసుకోవడమే అని కూడా వినిపిస్తుంది.
అనుపమని మెయిన్ హీరోయిన్‌గా, మేఘని సెకండ్ హీరోయిన్‌గా తీసుకోవడం వల్ల.. మేఘ ఆకాష్ ఈ చిత్రం నుండి తప్పుకుందని, తన టాలీవుడ్ ఎంట్రీ సోలో హీరోయిన్‌గా ఉండాలనే 'లై' చిత్రం చేసిందని, రామ్‌కి హ్యాండిచ్చిందని కూడా టాలీవుడ్‌లో వినిపిస్తుంది.