తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సెల్ఫీ దిగి.. దానిని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తన అభిమానం చాటుకుంది. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటం టైమ్‌లో కూడా కవిత డైరెక్ట్‌గానే చెప్పింది నేను చిరంజీవిగారికి అభిమానిని అని. చిరంజీవి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమని. ఆ అభిమానంను ఇప్పుడు ఇలా సెల్ఫీ రూపంలో ప్రదర్శించి మెగాస్టార్‌కి ఇప్పటికీ అభిమానినే అని మరొక్కసారి చాటుకుంది.
శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల నిమిత్తం ఓటు వేసేందుకు వెళ్ళిన కవిత..అక్కడకు అదే పనిమీద వచ్చిన చిరంజీవితో ఇలా సెల్ఫీ దిగి ఫ్యాన్ మూమెంట్ విత్ మెగాస్టార్ అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్ అవ్వడమే కాకుండా ఇంటర్‌నెట్ మాయాజాలంలో విపరీతంగా హల్‌చల్ చేస్తుంది.
మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలా ఫీలవుతున్నారో తెలియదు కానీ.. మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం యమా ఎంజాయ్ చేస్తున్నారు. కారణం తమ హీరోకి ఎటువంటి వారు అభిమానులు ఉన్నారో..అని ఈ ఫోటో చూపిస్తూ.. మా హీరో రేంజ్ ఇది అంటూ మెగాస్టార్‌కి జిందాబాద్‌లు కొట్టేస్తున్నారు.