Advertisement
Google Ads BL

పవన్ కి.. అన్నయ్య సలహా...!


తాజాగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ, తాను అక్టోబర్‌ నుంచి ప్రత్యక్ష రాజకీయాలు, ప్రజా సమస్యలపై పోటీ చేస్తానని, వారికి మూడు రోజులు దీనికే సమయం కేటాయిస్తానని, ఖాళీ దొరికినప్పుడు మాత్రమే సినిమాలు చేస్తానని, రాజకీయాలకు సినిమాలు అడ్డం అనుకుంటే సినిమాలైనా మానుకుంటానని పవన్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ఆయితే ఆయన రాజకీయాలతో పాటు సినిమాలలో కూడా నటించాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇంకా కెరీర్‌ పీక్‌లోనే ఉందని, రాజకీయాల కోసం సినిమాలను వదిలేసే వయసు ఇంకారాలేదని, కావాలంటే రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేయాలని అభిమానులే కాదు పవన్‌ అన్నయ్య చిరంజీవి కూడా అదే అభిప్రాయంలో ఉన్నాడట. పవన్‌ నిర్ణయం విన్న మెగాస్టార్‌ చిరంజీవి తన సన్నిహితుల వద్ద పవన్‌లో రాజకీయాలలో ఉంటూనే, ఇటు సినిమాలలో కూడా నటించే శక్తి సామర్ధ్యాలు కూడా ఉన్నాయని, రెండు పడవల ప్రయాణం కూడా ఆయన చేయగలగని ఆన్నాడట. 

ఇక కేవలం రాజకీయాలనే నమ్ముకుంటే తీవ్ర ప్రమాదమేనని, తాను కూడా అలాంటి తప్పు నిర్ణయమే నాడు తీసుకుని తప్పుచేశానని, రాజకీయాలను తాను కూడా చూశానని, అవి బాగుంటాయా? లేదా? అనేది తాను ఎవ్వరికీ చెప్పను... సలహాలు కూడా ఇవ్వనని, కానీ ఓ అన్నయ్యగా నా తమ్ముడి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని సినిమాలు కూడా చేస్తూనే ఉండాలనే సలహాని ఆయన ఇవ్వదలుచుకున్నాడట. తాను కూడా అదే తప్పు చేసి ఇబ్బందిపడ్డానని కాబట్టే తాను తన తమ్ముడికి తనకు తెలిసిన అనుభవంతో సలహా ఇవ్వాలని భావిస్తున్నట్లు చిరు సన్నిహితులు అంటున్నారు. మరి పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచిచూడాల్సివుంది..!

Chiranjeevi Advisory to Pawan Kalyan!:

Mega star Chiranjeevi&nbsp;<span>Advisory to Pawan Kalyan on politics and Cinemas.</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs