'బాహుబలి' మేనియాలోంచి ఇంకా తెలుగు సినిమా బయటకు రాలేదు. ఈ చిత్రం ప్రాంతాలు, భాషలకి, నటీనటులకి అతీతంగా ఘన విజయం సాధించడం ఎందరికో స్పూర్తినిస్తోంది. మురుగదాస్-మహేష్‌బాబుల చిత్రానికి మొదట 80 కోట్లు అనుకుని ఇప్పుడు 130దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి కూడా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోదుని చరిత్ర కావడంతో కేవలం ఆయనను తెలుగువాడిగా చూపకుండా, దేశంలోనే బ్రిటిష్‌వారిని ఎదిరించిన యోదునిగా చూపించనుండటంతో దీనిని ఇతర అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఇక ఆనాటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులతో పాటు నాటి వాతావరణాన్ని తలపించేలా ఈ చిత్రం కోసం భారీ సెట్టింగ్‌లు, కత్తులు, కటార్లతో యాక్షన్ సీన్స్, గుర్రాల వాడకం, ఇతర గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ పనులు కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని కూడా రప్పిస్తుండడటంతో ఈచిత్రానికి మొదట పెట్టాలనుకున్న 60-80 కోట్ల బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేశారు. ఇక రామ్ చరణే నిర్మాతగా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల బేనర్‌లో ఈ చిత్రం నిర్మితం కానుంది.
ఇక ఈచిత్రం అనౌన్స్‌మెంట్ స్వాతంత్య్రదినోత్సవ కానుకగా చేస్తే ప్రచారం లభిస్తుందని, మిగిలిన వివరాలను ఆగష్టు 22న చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో నయనతార, ఉపేంద్రలు కన్‌ఫర్మ్ అయ్యారని, ఇక అమితాబ్ బచ్చన్ ఐశ్వర్యా బచ్చన్‌లను కూడా సంప్రదిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంటు గానే ఉంటూ, బ్రిటిష్ వారికి తెరవెనుక సాయం చేస్తూ ఉయ్యాలవాడను వెన్నుపోటు పొడిచే పాత్రలో కన్నడ కిచ్చా సుదీప్ నటిస్తున్నాడని తాజా సమాచారం.
గతంలో 'ఈగ'లో పూర్తి విలన్ పాత్రను, 'బాహుబలి'లో చిన్నపాత్రను చేసిన సుదీప్ దీనికి అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి యూనిట్ అఫీషియల్‌గా స్పందిస్తే గానీ ఏ విషయం తెలియదు...!