Advertisement
Google Ads BL

బాలయ్య హీరోనా..విలనా..డౌట్స్ వచ్చేశాయ్?!


బాలకృష్ణ సినిమాల్లో విలన్లను చితక్కొట్టేస్తూ విశ్వరూపం చూపించేస్తుంటాడు. అది సినిమా కాబట్టి సరిపోతుంది. కానీ బయట కూడా బాలకృష్ణ తన కోపాన్ని అదుపు చేసుకోలేక ఒక్కోసారి అభిమానునులపై చేయి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బాలకృష్ణ కి మండిందీ అంటే ఎదుటువాటికి మూడిందనే లెక్క. బాలకృష్ణ కి చికాకు తెప్పిస్తే అది ఎవరైనా సరే వారికి తడిచిపోవాల్సిందే. మరి సినిమాల్లో చూపించాల్సిన హీరోయిజాన్ని బయట చూపిస్తే ఊరుకుంటారా. ఊరుకోకపోయినా అభిమానులు మాత్రం ఆ విషయంలో సైలెంట్ గానే ఉంటారు. కానీ మీడియా మాత్రం బాలకృష్ణ తో ఆడుకుంటుంది. బాలకృష్ణ ఎవరితోనైనా దురుసుగా ప్రవర్తించాడని తెలిసిందా ఇక బాలకృష్ణ కి నీరసం వచ్చేవరకు ఆయన గురించి మీడియాలో కథనాలు ప్రచారం చేస్తూనే ఉంటుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా తాజాగా బాలకృష్ణ అతని అసిస్టెంట్ మీద చేయి చేసుకున్న సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం చర్చలతోనే ఆగలేదు... బాలకృష్ణ తన అసిస్టెంట్ ని కొట్టిన చెంప దెబ్బ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదంతా ఆయన నటిస్తున్న 102 వ చిత్రం ముహూర్తం టైం లోనే జరిగింది. బాలకృష్ణ 102 వ సినిమాని కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో సి కళ్యాణ్ నిర్మాతగా ఆగష్టు 3 న మొదలు పెట్టాడు. ఈ పూజాకార్యక్రమానికి ఎంతోమంది అతిధులు హాజరయ్యారు కూడా. అయితే పూజ కి వచ్చిన బాలకృష్ణ మాత్రం తన పక్కన ఉన్న అసిస్టెంట్ చెంప చెళ్లుమనిపించాడు. 

అలా చెంప దెబ్బ కొట్టిన బాలకృష్ణ వెంటనే అతనికి కిందకు చూపించగా దెబ్బతిన్న అసిస్టెంట్ వెంటనే వంగి బాలయ్య పాదాలకు ఉన్న చెప్పులు తీసి పక్కన పెట్టాడు. అసలు చెంప దెబ్బ కొట్టడమే ఇదైనప్పుడు చెప్పులు కూడా అతనితో తీయించి బాలకృష్ణ సమాజానికి ఎలాంటి మెస్సేజ్ ఇవ్వాలనుకున్నాడు. అసలు ఇలాంటి హీరోలనా ఫ్యాన్స్ నెత్తిన పెట్టుకుని మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని విర్రవీగుతారంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ స్టార్ట్ చేశారు నెటిజన్లు. అయినా సినిమాల్లో కోపం ప్రదర్శిస్తే హీరో అంటారు గాని నిజ జీవితంలో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా విలన్ అనే అంటారు.

Balakrishna Slaps His Assistant:

A Senior Star from one of the film industries of India often gets indulged in unnecessary controversies.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs