Advertisement
Google Ads BL

'జై లవ కుశ' మెయిన్ పాయింట్ లీక్..!


ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న 'జై లవ కుశ' చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే సినిమా మొదలైనప్పటి నుండి ఈ సినిమాకి సంబందించిన ఏదో ఒక విషయం అంటే  సినిమాలోని డైలాగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి... పిక్స్ కానివ్వండి ఇలా ఏదో ఒకటి చిత్ర యూనిట్ కి తెలియకుండానే బయటికి లీకైపోతున్నాయి. మొన్నటికి మొన్న టీజర్ లోని కొన్ని సన్నివేశాలు లీక్ కాగా నిన్నేమో సినిమాలోని కొన్ని పిక్స్ లీకయ్యాయి. అలాగే 'జై లవ కుశ' టైటిల్ సాంగ్ కూడా లీకైందంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే.  చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఇలా 'జై లవ కుశ'కి సంబందించినది ఎదో ఒకటి లీక్ అవుతూనే వుంది.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు తాజాగా 'జై లవ కుశ' స్టోరీ లైన్ లీకయ్యిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమంది. ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్ ఈ వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జై, లవ, కుశ లు మూడు పాత్రలకు ఒకే తండ్రి అయినప్పటికీ తల్లులు వేరువేరు. అయితే ఇద్దరికి తల్లి ఒకరే అయినప్పటికీ మూడోపాత్రకి మాత్రం మరొక తల్లి వుందని చెబుతున్నారు. అందులో మొదటి భార్యకి 'జై' పుట్టగా... రెండో భార్యకి 'లవ, కుశ'లు పుడతారని అంటున్నారు. అయితే తన తండ్రి వల్లే తల్లి చనిపోయిందని భ్రమలో ఉన్న 'జై' తన తండ్రిని అతని రెండో భార్య కుటుంబాన్ని అంతం చెయ్యాలనే కసితో ఉంటాడట. అదే కసితో పెరిగి పెద్దవాడవుతాడట 'జై'.

ఇక చిన్నప్పటి నుండి తండ్రి... అతని కుటుంబంపై పగ పెంచుకుని తప్పుడు పనులు చేస్తూ చెడ్డవాడిగా మారిపోతాడట. ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ స్టర్ అవతారమెత్తి రాజకీయనాయకుడిగా ఎదుగుతాడట. అయితే 'లవ' బ్యాంకు మేనేజర్ గా 'కుశ' డ్రామా ఆర్టిస్ట్ గా తన తండ్రి వద్దనే ఉంటారట. ఇక ఒకరు పగతో రగులుతూనే మరో ఇద్దరు హ్యాపీగా బ్రతకడం అలాగే ఆ ముగ్గురి మధ్యన వచ్చే ప్రేమ, పగ, కామెడీతో ఈ సినిమా ఉండబోతుందంటున్నారు. అయితే ఇక్కడ  మరో విశేషమేమిటంటే ఈ చిత్ర కథ అంతా 'జై లవ కుశ' లో కీలక  పాత్ర పోషిస్తున్న పోసాని కృష్ణ మురళి చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. మరి 'జై లవ కుశ' గా ఎన్టీఆర్ ఈ చిత్రంలో అద్భుతంగా నటిస్తున్నాడనే టాక్ బయటికి వచ్చింది. 

ఇక ఈ చిత్ర 'లవ' టీజర్ ని రక్షాబంధన్ శుభాకాంక్షలతో ఈనెల 7 న విడుదల చేయబోతున్నట్లు ఆఫీషియల్ గా ప్రకటించారు.

Jai Lava Kusa Story line Leaked:

Jr NTR Jai Lava Kusa Movie Story Line Hulchal in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs