Advertisement
Google Ads BL

'స్పైడర్‌'పై అప్పుడే రచ్చ మొదలైంది...!


ప్రస్తుతం సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పైడర్‌' దసరా కానుకగా సెప్టెంబర్‌ 27 న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్‌ కానుంది. చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయింది. వీలుంటే ఈ చిత్రాన్ని మురుగదాస్‌కి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా హిందీలో కూడా థియేటర్లలో భారీగా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో మహేష్‌ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ చిత్రంపై అబిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నఈ చిత్రంలో ప్రధాన విలన్‌గా ఎస్‌.జె.సూర్య నటిస్తుండగా, యంగ్‌ విలన్‌గా భరత్‌ నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌, ఠాగూర్‌ మధులు ఏకంగా 130కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక మురుగదాస్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉన్న లైకా సంస్థ దీని తమిళ విడుదల హక్కులను భారీ రేటుకు తీసుకుంది. తాజాగా విడుదల చేసిన ఈ చిత్రం పోస్టర్స్‌లో మహేష్‌ ఎంతో స్టైలిష్‌గా ఉండి బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక తాజాగా హరీష్‌జైరాజ్‌ స్వరపరిచిన 'బూమ్‌బూమ్‌' పాట అదిరిపోతోంది. ఆ పాట సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది. ఇక ఈ చిత్రంలోని 'బూమ్‌ బూమ్‌' పాటకు వర్మ నుంచి వెన్నెల కిషోర్‌ వరకు అందరూ ఎంతో ఆనందంగా విని, ఈ పాటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

అయితే యాంటీ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ మాత్రం ఇది విదేశీ పాటకు కాపీగా చెబుతున్నారు. అమెరికాలోని ఐదుగురు అమ్మాయిలు 'ఫిఫ్త్‌ హార్మోని' అనే బ్యాండ్‌ మొదలుపెట్టారు. వీరు ఆమద్య 'రిఫ్లెక్షన్స్‌' అనే ఆల్బమ్‌ని రూపొందించారు. అందులోని 'వర్త్‌ ఇట్‌' అనే పాటను హరీస్‌జైరాజ్‌ కాపీ కొట్టి, 'స్పైడర్‌'లో వాడాడనేది ఆ ఆరోపణ. ఆ పాటలో ఉన్న సన్నాయి బీట్‌ పాట మొత్తం బాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉంటుంది. అలాంటి సన్నాయి బీటే 'స్పైడర్‌' చిత్రంలోని 'బూమ్‌ బూమ్‌'లో ఉంది. ఇక ట్యూన్‌పరంగా ఈ రెండింటికి ఎలాంటి పొంతన లేదు అనే చెప్పాలి. 

Negative Comments on Spyder Boom Boom Song:

Spyder Song sensation in Net World
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs