Advertisement
Google Ads BL

బాలయ్యో..ఈ గెటప్‌ అదే కదయ్యో!


తమిళంలో రూపొందే పలు చిత్రాలు తెలుగులోకి అనువాదం అవుతూ, రీమేక్‌ల బాటలో బాగానే సక్సెస్‌లు సాధిస్తుండటంతో అందరు తెలుగు, తమిళ ప్రేక్షకులది ఒకే అభిరుచి అని చెబుతూ ఉంటారు. కానీ యూనివర్శల్‌, లవ్‌ సబ్జక్ట్స్ లో ఓకేగానీ తమిళ ప్రేక్షకులు తెలుగువారి కంటే కాస్త అతికోరుకుంటారు. గతంలో కూడా పలు చిత్రాల రీమేక్‌ల విషయంలో, తమిళ దర్శకులు తీసిన తెలుగు చిత్రాలతో అది ప్రూవ్‌ అయింది. దానికి కారణం తమిళ చిత్రాలలోని అతిని తగ్గించకుండా యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా తీసిన రాజశేఖర్‌ 'మొరటోడు నా మొగుడు, గడ్డం గ్యాంగ్‌, అమ్మకొడుకు, బాలకృష్ణ నటించిన మహారధి వంటివి దానికి ఉదాహరణ. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే రాజకీయాలు, హిందూపురం నియోజకవర్గం గురించి పట్టించుకున్నా,పట్టించుకోకపోయినా ఆయన గ్యాప్‌లేకుండా బిజీబిజీగా చిత్రాలు చేస్తుంటాడు. తన 100వ చిత్రం క్రిష్‌ 'గౌతమీపుత్ర శాతకర్ణి' సమయంలో మాత్రమే కాస్త గ్యాప్‌ తీసుకున్నాడు. ఇక తన 101వ చిత్రంగా బాలయ్య.. పూరీజగన్నాథ్‌ చిత్రం 'పైసావసూల్‌' గుమ్మడికాయ కొట్టారో లేదో వెంటనే తన 102వ చిత్రం మొదలుపెట్టేశాడు. ఇక దీనికి 'సింహా, లెజెండ్‌' వంటి బ్లాక్‌బస్టర్స్‌ని బాలకృష్ణకి ఇచ్చిన బోయపాటి శ్రీను క్లాప్‌ కొట్టాడు. రామోజీఫిల్మ్‌ సిటీలో ఈ వేడుక జరిగింది. 

ఇక ఈ చిత్రం గెటప్‌లో మరలా పాత బాలయ్య తన ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. చారిత్రక కథ అయిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో కాస్త గెటప్‌ మార్చిన బాలయ్య పూరీ 'పైసా వసూల్‌'లో ఎంతో స్టైలిష్‌ గెటప్‌లో కనిపిస్తున్నాడు. కానీ తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ తాజా చిత్రంలో మాత్రం మరోసారి రీమేక్‌ చేసిన 'లక్ష్మీనరసింహ', తమిళ దర్శకుడు 'మహారధి' చిత్రాలను పోలిన ఊరమాస్‌లుక్‌తో కనిపిస్తున్నాడు. దర్శకులు ఏ గెటప్‌ వేసినా, ఏ సబ్జెక్ట్‌ అయినా ఒకసారి డైరెక్టర్‌కి బాలయ్య ఓకే చెబితే ఇక దేనిని పట్టించుకోకుండా దర్శకుడు చెప్పిన గెటప్‌నే వేసుకున్నట్లు కనిపిస్తోంది. 

Balakrishna 102 Movie Look Talk:

Balakrishna and KS Ravikumar Movie Opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs