Advertisement

'స్పైడర్'..'బుమ్ బుమ్' బూస్టిచ్చింది..!


మహేష్ హీరోగా డైరెక్టర్ మురుగదాస్ 'స్పైడర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్రం మొదలు పెట్టినప్పటినుండి ఒక యజ్ఞంలా భావిస్తూ మురుగదాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన చాలా రోజుల వరకు సినిమా టైటిల్ ని గాని మహేష్ లుక్ గాని వదలకుండా తాత్సారం చేసిన మురుగదాస్, మహేష్ ఫాన్స్ కి పండగ చేసుకునేలాంటి మహేష్ లుక్ ని వదిలాడు. అలాగే 'స్పైడర్' కథ రివీల్ కాకుండా జగ్రత్తలు తీసుకుంటూ 'స్పైడర్' టీజర్ ని పరిచయం చేసిన మురుగదాస్ అన్ని విషయాల్లో లేట్ చేసినట్లే ఇప్పుడు 'స్పైడర్' సాంగ్ ని కూడా సాయంత్రం ఐదింటికి విడుదల చేస్తామని చెప్పినప్పటికీ దానిని ఎనిమిదింటికి వాయిదా వేసి మహేష్ అభిమానులని మూడు గంటల పాటు నిరుత్సాహ పరిచాడు.

Advertisement

కానీ లేట్ అయినా కత్తిలాంటి సాంగ్ ని మేకింగ్ తోపాటు విడుదల చేసింది స్పైడర్ టీమ్. 'బుమ్ బుమ్' అంటూ సాగే ఈ పాటను ఇప్పుడు యూట్యూబ్ లో విడుదల చేశారు. మహేష్ స్పైడర్ మేకింగ్ వీడియోలో ఎంతో స్టైలిష్ గా సూపర్ లుక్ లో కనబడుతూ అందరికి మతులు పోగొడుతున్నాడు. హరీష్ జై రాజ్ సంగీతం అందించిన స్పైడర్ చిత్రంలోని ఈ 'బూమ్ బూమ్' పాటని హరీష్ నిఖిత గాంధీ తో పాడించాడు. ఇక స్పైడర్ మేకింగ్ కూడా అదరగొడుతుంది. సంతోష్ శివన్ తన స్టయిల్లో ఈ సాంగ్ ని స్టైలిష్ లుక్ లో తెరకెక్కించాడు.. 

మార్కెల్ కామిక్స్ ఇతన్ని చూసి రాశారేమో.. హాగ్వార్ట్స్ ఇతను పట్టాగాని పొందాడేమో అంటూ సాగే ఈపాట మాత్రం మాస్ కి పెద్దగా ఎక్కదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ క్లాస్ ప్రేక్షకులకు ఈ స్పైడర్ సాంగ్ మాత్రం పిచ్చ పిచ్చగా అలరించేస్తుంది. ఇక సినిమా మేకింగ్ లో మురుగదాస్ పనితనం, ఆయన గొప్పదనం అడుగడుగునా కనబడుతుంది. ఇక స్పైడర్ సాంగ్ మేకింగ్ లో మహేష్ బాబు  కొన్ని డాన్స్ స్టెప్స్ చూస్తుంటే మాత్రం మహేష్ డాన్స్  విషయంలో చాలా కేర్ తీసుకున్నాడనిపిస్తుంది. ఇక స్పైడర్ మేకింగ్ లో మాత్రం మహేష్ నవ్వుకు అందరూ పడిపోవాల్సిందే.

డైరెక్టర్ మురుగదాస్ స్పైడర్ లుక్ విషయం లో ఎంత తాత్సారం చేసిన అవుట్ ఫుట్ ని మాత్రం అందరు మెచ్చుకునేలా ఇచ్చి మహేష్ అభిమానులుకు పండగ వాతావరణం తెచ్చిచ్చాడు. ఇకపోతే స్పైడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసే పిచ్చెక్కిపోతుంటే ఇప్పుడు స్పైడర్ సాంగ్ తో వారు మరింతగా రెచ్చిపోతున్నారు. 

Clich Here to see the Spyder Boom Boom song Making Video

Spyder Boom Boom Song Talk:

Ever since team Spyder announced that the first single would be out on the evening of 2nd August, Prince Mahesh's fans have been excited to the core for the release of the song. Finally, the much awaited 'Boom Boom' song was out some time ago bringing boundless cheers to fans.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement