Advertisement
Google Ads BL

ప్రభాస్ కి ఈ అమ్మాయి ఫైనల్‌ అయిందట..!


బాహుబలి తర్వాత ప్రభాస్‌ నేషనల్‌ ఐకాన్‌గా మారాడు. ఆయన తదుపరి సుజీత్‌తో యువిక్రియేషన్స్‌ సంస్థలో చేస్తున్న 'సాహో' చిత్రం షూటింగ్‌ దాదాపు మొదలైంది. విలన్‌ నీల్‌ నితిన్‌ ముఖేష్‌తో కొన్నిసీన్లు తీస్తున్నారు. త్వరలో ప్రభాస్‌ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడు. చూచాయగా విడుదల చేసిన టీజర్‌ ద్వారా ఇదేమైనా సైన్స్‌ ఫిక్షన్‌ మూవీనా అని కొందరికి అనుమానం ఏర్పడింది. కానీ ఇది సైన్స్‌ ఫిక్షన్‌ మూవీకాదని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈచిత్రం రూపొందనుందని ఈ మద్య నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ క్లారిటీ ఇచ్చాడు. 

Advertisement
CJ Advs

ఇక ఈచిత్రంలో ఆయన లుక్‌పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆమధ్య ఓ పిక్‌ ఇదే ప్రభాస్‌ 'సాహో'లుక్‌ అని ప్రచారం జరిగింది. ఇక ఇటీవల జరిగిన ఎం.శ్యాంప్రసాద్‌రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రభాస్‌ మరో లుక్‌లో కనిపించాడు. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆగష్టు 15న స్వాతంత్రదినోత్సవ కానుకగా విడుదల చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని మిగిలిన సాంకేతిక నిపుణులు, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నా కూడా హీరోయిన్‌ విషయంలో సందిగ్డం ఏర్పడింది. మొదట కత్రినాకైఫ్‌, దిశాపటానీ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. తర్వాత అనుష్కనే నటిస్తుందన్నారు. అభిమానులు కూడా ఎంతో ఆనందపడ్డారు. వీరి పెయిర్‌ని వారు బాగా ప్రేమించారు. 

వారిద్దరు కలిసి వివాహం చేసుకుంటారని కూడా వదంతులు వచ్చాయి. కానీ అవి నిజం కాదని తేలిపోయింది. ఇక బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనుష్కను పక్కనపెట్టారన్నారు. కానీ 'బాహుబలి' తర్వాత అనుష్క వెంటనే కొన్ని తమిళ చిత్రాలకు డేట్స్‌ ఇవ్వడంతో 'సాహో' డేట్స్‌కి, వాటికి క్లాష్‌ వస్తాయని అనుష్కే వద్దనుకుందని వార్తలు వచ్చాయి.ఇక ఈ చిత్రంలో ఆఖరికి ఓ పేరుగా ప్రచారంలో ఉన్న శ్రద్దాకపూరే ఓకే అయిందని, మొదట్లో దర్శకనిర్మాతలకు, శ్రద్దాకపూర్‌కి బేధాలు వచ్చినా, చివరికి ఒకరినొకరు సర్దుబాటు చేసుకోవడంతో శ్రద్దాకపూర్‌ ఫైనల్‌ అయిందట. దీంతో ఈ విషయాన్ని త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్‌ చేయనున్నారు. ఈ వార్త విని ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. 

Shraddha Kapoor Opposite Prabhas!:

Reportedly Anushka has been replaced by the Bollywood heroine Shraddha Kapoor in Saaho. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs