Advertisement
Google Ads BL

చైతు.. మరొక్కసారి అంటోంది..!


నాగ చైతన్య లవర్ బాయ్ గా వచ్చిన 'ఒక లైలా కోసం' కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పెంకి పిల్ల పాత్రలో పూజ హెగ్డే నటించింది. చాలా ట్రెడిషనల్ గా నటించిన పూజ ఆ తర్వాత మళ్ళీ తెలుగులో అల్లు అర్జున్ సరసన 'డీజే' చిత్రంలో అందాల ఆరబోతతో ఒక ఊపు ఊపింది. ఒక్కసారిగా స్విమ్ సూట్ లో దర్శనమిచ్చి కైపెక్కించిన పూజ హెగ్డే మరోసారి నాగ చైతన్యతో జోడి కడుతుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి.

Advertisement
CJ Advs

'యుద్ధం శరణం' తర్వాత నాగ చైతన్య, చందు మొండేటి డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. చైతు - చందు కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రంలో నాగ చైతన్య కి జోడిగా పూజ హెగ్డేని తీసుకుంటున్నారనే టాక్ వినబడుతుంది. మరే ఇతర హీరోయిన్ చైతు పక్కన సెట్ అవకపోవడం వలెనే ఫైనల్ ఆప్షన్ గా పూజని తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇక చందు మొండేటి - నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు లో పూజ కార్యక్రమాలు చేసుకుని సెప్టెంబర్ 11  తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోనుందట.

ఈలోపు నాగ చైతన్య - సమంత ల వివాహం కూడా జరగాల్సి ఉంది. వివాహం తర్వాత చైతు కొద్దీ రోజులు గ్యాప్ తీసుకుని చందు డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ఇక పూజ హెగ్డే కూడా 'డీజే' చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఒక సినిమాకి కమిట్ అయ్యింది.

Pooja Hegde in Naga Chaitanya and Chandoo Mondeti Film:

Pooja Hegde again with Naga Chaitanya after Oka Laila Kosam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs