Advertisement
Google Ads BL

బాలయ్య డేట్, ప్లేస్ ఫిక్స్ చేశాడు!


తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు ఎవరైనా చాలా ఫాస్ట్ గా తెరకెక్కించి విడుదలకు చేస్తారు అంటే అది ఒక్క పూరి జగన్నాథే. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ 'పైసా వసూల్' చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న 'పైసా వసూల్' చిత్ర స్టంపర్ మొన్నీమధ్యనే విడుదలై యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. బాలకృష్ణ స్టైల్, ఆయన డైలాగ్ పవర్, ఆయన యాక్షన్ అన్ని కలిపి పూరి చేతిలో పెట్టిన బాలయ్య... ఇప్పుడు పూరి డైరెక్షన్ లో 'పైసా వసూల్' ఓ దుమ్ము దులపడానికి రెడీ అవుతుంది.

Advertisement
CJ Advs

వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ స్టంపర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో దసరాకి విడుదల చేస్తున్నామని రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన పూరి, బాలయ్యలు ఇప్పుడు సెప్టెంబర్ 1 నే వస్తున్నామని చెబుతున్నారు. మరి రికార్డు స్థాయిలో షూటింగ్ కంప్లీట్ చేసేసి సినిమా విడుదలకు సిద్ధం చేసిన పూరి జగన్నాధ్ గ్రేట్ కదా. ఇకపోతే ఈ చిత్ర ఆడియోని ఈ ఆగస్టు 17వ తేదీన ఖమ్మంలో నిర్వహించనున్నారు.

నందమూరి అభిమానుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా ఖమ్మంలోని ఎస్.ఆర్.అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనుంది. పైసా వసూల్ కి ఆడియో కి సంబందించిన ఆడియో పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న 'పైసా వసూల్' చిత్ర ఆడియో కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

Paisa Vasool Audio Release Updates:

Balayya and Puri Jagannadh Paisa Vasool Audio Release Date and Place Fixed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs