Advertisement
Google Ads BL

బోయపాటికి.. కాస్త ఎక్కువైందేమో..?


బోయపాటి శ్రీను తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జయ జానకి నాయకా' చిత్రం ఆడియోలో కాస్త ఎక్కువగానే మాట్లాడనిపిస్తోంది. ఈ ఏడాది నాలుగు వండర్స్‌ జరిగాయని చెబుతూ, అందులో కె.విశ్వనాథ్‌కి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు రావడం ఒకటి.. 'బాహుబలి-ది కన్ల్‌కూజన్‌' చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచినది రెండోది. చిరంజీవి రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్‌ 150' రావడం మరోటి.. ఇక ఆఖరిగా తను బాలకృష్ణతో చేసిన 'లెజెండ్‌' చిత్రం 1000  రోజుల ఆడి, ఒకే థియేటర్‌లో నాలుగు క్యాలెండర్లు చూసిన ఘనత తన చిత్రానిదే అని చెప్పాడు. 

Advertisement
CJ Advs

ఇక ఆడిందా? లేక ఆడించారా? అనేది పక్కనపెడితే 25 రోజుల పోస్టర్లే కరువైపోతున్న ఈ రోజుల్లో ఒక చిత్రం విడుదలై ఆడి ఉంటే ఈ రోజుకి ఏడాది అని బాపుగారిలాగా తనపై తాను జోక్‌ చేసుకున్న విధంగా ఈ 'లెజెండ్‌' గురించి ప్రస్తావన అసలు అవసరమా? ఈ వ్యాఖ్యలు నవ్వుల పాలు కావడానికి, మరో చర్చకు దారి తీయడానికి తప్పితే దేనికైనా ఉపయోగపడతాయా? అనేది బోయపాటి ఆలోచించుకోవాల్సిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. 

ఇక ఈచిత్రం ట్రైలర్‌ని చూసి వినాయక్‌ ఈచిత్రం ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ చూస్తే తనకు 'ఛత్రపతి' గుర్తుకొచ్చిందని, తన 'అల్లుడుశీను' కంటే బెల్లంకొండ సాయశ్రీనివాస్‌ నటనలో, డైలాగ్‌ డెలివరిలో బాగా ఇంప్రూవ్‌మెంట్‌ వచ్చిందని పొగిడాడు. కానీ చిత్రం ట్రైలర్‌ని చూసిన వారు మాత్రం ఈ ట్రైలర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ డైలాగ్‌ డెలివరీనే ప్రధాన మైనస్‌గా చెబుతున్నారు. ఏది ఏమైనా, ఎలాంటి సెటైర్లు వచ్చినా, ఈచిత్రం బాగా ఆడితే మాత్రం ఆ ఘనత సాయిశ్రీనివాస్‌కి, బోయపాటికి, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిలకే దక్కుతుంది....!

Boyapati Sreenu at Jaya Janaki Nayaka Audio Launch:

Boyapati Sreenu has again reminded about Legend to everyone at the audio function held yesterday.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs