Advertisement
Google Ads BL

'అర్హ'మైన అల్లు అర్జున్ ఆనందం..!


సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్క విషయాన్నీ అభిమానులతో పంచుకోవాలనే ఉత్సాహంతో స్టార్స్ అంతా ఎప్పటికప్పుడు తమ తమ సినిమా విశేషాలను, పర్సనల్ లైఫ్ విశేషాలను ఫేస్ బుక్, ట్విట్టర్ లలో పోస్ట్ చేస్తూ యాక్టీవ్ గా వుంటున్నారు. తమ సినిమా విశేషాలతో పాటే తమ పిల్లలతో తాము గడిపిన మధుర క్షణాలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం అనేది ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే. ఇక తమ అభిమాన నటులతో పాటే వారి ఫ్యామిలీ గురించి కూడా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఆయా అభిమానులు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ సంతోషపడుతున్నారు.

Advertisement
CJ Advs

ఇలా 100 లో 90  శాతం నటీనటులు తమ పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. చిరంజీవి దగ్గరనుండి అందరు స్టార్స్ ఇలా హ్యాపీ మూమెంట్స్ ని అందరితో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. తమకి పుట్టిన పిల్లలతో ఫొటోస్ దిగడం దగ్గరనుండి ప్రతి ఒక్క మూమెంట్ ఇలానే చేస్తున్నారు. ఇక టాప్ హీరోస్ తమ పిల్లల్తో బయటికి వెళ్ళిన... అక్కడ ఫొటోస్ దిగేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తున్నారు. మరి సెలబ్రిటీస్ పిల్లలంటే వారికి అదే హోదా వచ్చేస్తుంది  కదా. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మిగతా స్టార్స్ అంతా తమ పిల్లల్తో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడే బయట ప్రపంచానికి తెలిసేలా సాంఘీక మాధ్యమాలను వాడుకుంటున్నారు.

ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ తన కూతురు అల్లు అర్హ ని ఎత్తుకుని గాల్లో తిప్పుతూ ఆడుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో అర్హ ఎంతో ముద్దుగా బబ్లీగా వుంది. ఎలా అర్హ తో ఆడుకుంటూ అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. అల్లు అర్జున్ ఇదివరకు కూడా కొడుకు అయాన్ తో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ని కూడా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరించాడు. ఇక అర్హ పుట్టినప్పటి నుండి అల్లు స్నేహ.. అర్హ ఫొటోస్ ని ఎప్పటికప్పుడు ఇలా అందిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ ఫోటో మాత్రం కొంచెం స్పెషల్ గా కనబడుతుంది కదా..!

Allu Arjun Posts His Daughter Arha Pic in Facebook Page:

Allu Arjun introduces his cute little angel Arha to his followers in facebook
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs