Advertisement
Google Ads BL

అబ్బ...హేమ ఏం చెప్పింది...?


టాలీవుడ్ లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ ఎప్పటి నుండో అదరగొట్టేస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో మంచి ఎంటర్టైన్మెంట్ పండించగల సత్తా హేమ కి ఉండడంతో ఆమెను తమతమ సినిమాల్లోకి తీసుకునేవారు. అయితే హేమకి ఇప్పుడు పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదు. కాబట్టే ఆమె చూపు రాజాకీయాలవైపు మళ్లిందనే టాక్ కూడా ఉంది. అయితే హేమ సినిమాల్లో నటించడంతో పాటే కొన్ని వివాదాల వలన కూడా హేమ విపరీతంగా ఫోకస్ అయ్యింది. అయితే సినిమాలో అవకాశాలు తగ్గడంపై హేమని ప్రశ్నిస్తూనే... మీకు దర్శకుడు పూరీ గారు బాగా దగ్గర  కదా... అసలు మీ కుటుంబంలో ఒక సభ్యుడు లా కలిసిపోయేవాడు. అలాంటి ఆయన కూడా మీకు తన సినిమాల్లో ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అని అడగగా... దానికి హేమ ఇలా చెప్పుకొచ్చింది.

Advertisement
CJ Advs

పూరి జగన్నాధ్ నాకు ఒక అన్న లాంటివాడు. నాకు తన సినిమాల్లో ఆఫర్స్ ఇవ్వకపోవడానికి పెద్దగా కారణాలేమీ లేవు. పూరికి నేను అక్కగా లేదా వదిన పాత్రలు మాత్రమే చెయ్యాలని ఉంటుంది. నేను అమ్మగా చేస్తే పూరి తట్టుకోలేడు. అందుకే పూరి సినిమాలో నాకు ఛాన్స్ లు ఇవ్వడు. ఇప్పుడే కాదు నాకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాకు పూరి అవకాశం ఇవ్వలేదు అంటూ తనకు అవకాశాలు తగ్గాయని హేమ ఒప్పేసుకుంది.

ఇక ఇప్పుడు ఇండస్ట్రీలోని లేడీస్ పై చాలా విమర్శలొస్తున్నాయి. దీనికి మీరేమంటారని అడగగా.. దానికి హేమ కాస్త సీరియస్ గా మీకు సినిమా వాళ్ళు ఒక్కరే కనబడతారా... మిగతా రంగాలలో ఇలాంటివి లేవా..అంటూ చురుకైన సమాధానం చెప్పింది. అయినా ఒకప్పుడు ఇలాంటివి చాలానే ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడం.... చదువుకున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎక్కువగా వుంటున్నారు కాబట్టి వారికీ ఇష్టమైతే ఎటువంటి సంబంధాలైనా కొనసాగిస్తారు. అందులో ఎలాంటి తప్పు లేదంటూనే.. ప్రపంచం అంతా కేవలం సెక్స్ చుట్టూ డబ్బు చుట్టూనే కదా తిరుగుతాయి. మన జాతి బుద్దులే అంత అంటూ కాస్త ఘాటుగానే స్పందించింది.

Hema Talks About Her Movie Chances:

Character Artist Hema Talks About Telugu Film Industry and Puri Jagannadh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs