Advertisement
Google Ads BL

క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరూ విలన్స్ అయ్యారు..?


టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోలుగా ఒక ఊపు ఊపిన జగపతిబాబు, అర్జున్ లు నిజ జీవితాల్లో మంచి ఫ్రెండ్స్. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునేంత ఫ్రెండ్షిప్ వారిలో వుంది. ఇక అర్జున్ ఎప్పుడూ హైదరాబాద్ వచ్చినా జగపతి బాబు ఇంట్లోనే స్టే చెయ్యడం దగ్గరనుండి అన్ని విషయాలు జగపతిబాబుతో షేర్ చేసునేంత ఫ్రెండ్ షిప్ వారిది. ఇక జగపతిబాబు కూడా షూటింగ్ నిమిత్తం చెన్నై వెళితే అర్జున్ ఇంటికే వెళతాడు. వీరిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు కూడా. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'హనుమాన్ జంక్షన్' అప్పట్లో ఎంతపెద్ద హిట్టో తెలిసిందే.

Advertisement
CJ Advs

అయితే ఇంత క్లోజ్ గా వుండే ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఇప్పుడు ఒకే రూటులో వెళుతున్నారు. జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో 'లెజెండ్' సినిమాతో విలన్ గా అవతరించాడు. ఆ చిత్రంలో బాలకృష్ణతో సమానంగా నటించి శెభాష్ అనిపించాడు. ఆ సినిమాలో జగపతి బాబు నట విశ్వరూపం ఎప్పటికి మరిచిపోలేనిది. అలాగే ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో' వంటి చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించాడు జగపతి బాబు. ఇప్పుడు ఆయన ఫ్రెండ్ అర్జున్ కూడా విలన్ అవతారం ఎత్తేశాడు. అర్జున్ ఇప్పటికీ హీరోగా చేస్తున్నప్పటికీ నితిన్ 'లై' సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడనే విషయం 'లై' టీజర్ లో అర్ధమయ్యింది. మరి ఇలా అర్జున్ విలన్ గా మారడానికి తన ఫ్రెండ్ జగపతి బాబు సలహా ఎమన్నా తీసుకుని విలన్ గా టాలీవుడ్ లోకి దిగాడా అని ఒక పక్క అనిపిస్తుంది.

లేకుంటే తన ఫ్రెండ్ కి పోటీగా ఇలా విలన్ వేషాలు వేస్తున్నాడా? అనేది మాత్రం కొంచెం సస్పెన్స్. ఇకపోతే అర్జున్ మాత్రం జగపతిబాబుకి ఈ 'లై' సినిమాలో విలన్ గా మెప్పించి కాంపిటీషన్ అవ్వాలనుకుంటున్నాడా? ఏమో తెలియదు గాని ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్య వార్ మాత్రం షురూ అంటున్నారు. ఇండస్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు విలన్స్ గా మారారనే కామెంట్స్ మాత్రం బాగా వినిపిస్తున్నాయి.

Jagapathi Babu and Arjun Villain Roles in Tollywood:

Arjun Competates Jagapathi Babu in tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs