Advertisement
Google Ads BL

ఎంతందంగా ఉన్నాదో..కదా..!


ఈ మధ్యన ఆఫర్స్ లేవు లేవంటూనే కాజల్ అగర్వాల్ బోలెడు సినిమాల్లో చాన్సులు కొట్టేస్తుంది. ఈ ఏడాది చిరంజీవి పక్కన 'ఖైదీ నెంబర్150' లో మెరిపించిన కాజల్ ఇప్పుడు రానాకీ జోడిగా 'నేనే రాజు - నేనే మంత్రి' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో హీరో రానాకీ భార్యగా మంచి ట్రెడిషనల్ లుక్ తో అదరగొట్టబోతుంది. వయసు 30  కి పైబడినా వన్నెతరగని అందంతో ఇప్పటికీ మెరుపులు మెరిపిస్తున్న కాజల్ పొరుగు రాష్ట్రం తమిళనాట కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటుంది.

Advertisement
CJ Advs

ఇక గత పదేళ్లుగా అందమైన ముఖంతో మంచి ఫిజిక్ తో అదరగొడుతున్న కాజల్ ఇప్పటికీ అంతే ఫ్రెష్ లుక్ ని మెయింటింగ్ చేస్తుంది. ఇప్పుడు తేజ డైరెక్షన్ లో వస్తున్న 'నేనే రాజు నేనే మంత్రి' లో అందమైన చీరల్లో ఆకర్షణీయంగా కనబడుతున్న కాజల్ అగర్వాల్ మీద నుండి చూపు తిప్పుకోవడం కష్టమే అనిపించక మానదు. చందమామ లాంటి మొహంతో అందరిని కట్టిపడేస్తుంది. చీర కట్టులోనూ ఎంత గ్లామర్ పండించాలో అంత గ్లామర్ పండిస్తూ ఈ 'నేనే రాజు - నేనే మంత్రి'తో అందరి మతులు పోగొడుతుంది.

అందులోను రానాతో కాజల్ చేసే రొమాన్స్ ఈ చిత్రానికే హైలెట్ కానుందనే నానుడి ఉండనే ఉంది. మోడరన్ డ్రెస్సుల్లో ఎంతగా కైపెక్కిస్తుందో ఇప్పుడు చీరలోను అంతే అందంగా కనిపిస్తూ కుర్రకారు మతులు పోగోట్టేస్తుంది. కాజల్ 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రంలోని చీరకట్టు అందాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకి ఆనందాన్ని పంచుతుంది. ఇక రానా, కాజల్, కేథరిన్ లు నటించిన 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం ఆగస్ట్ 11 నే థియేటర్స్ లోకి రాబోతుంది.

Kajal Younger Looks In Nene Raju Nene Mantri Movie:

Kajal's excitingly younger looks in saree has been pinching the male hearts.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs