Advertisement
Google Ads BL

యాక్షన్‌ థ్రిల్లర్‌తో ఆకట్టుకున్నాడు..!


నాగ చైతన్యకు ఇప్పటి వరకు పెద్దగా యాక్షన్‌ చిత్రాలు, విభిన్న చిత్రాలు కలిసిరాలేదు. కేవలం రొమాంటిక్‌ అండ్‌ క్లాస్‌ చిత్రాలే ఆయనను నిలబెట్టాయి. కానీ సాయి కొర్రపాటి కృష్ణ RV మరిముత్తు అనే తమిళ దర్శకుడుతో తెరంగేట్రం చేయిస్తూ తీసిన 'యుద్దం శరణం' చిత్రం టీజర్‌ చాలా బాగుంది. ఇది ధైర్య కాదు.. తెగింపు అంటూ నాగ చైతన్య సినిమా స్టోరీని సింగిల్‌ డైలాగ్‌తో తేల్చేశాడు. 'మనం బతకాలంటే.. వాడికి ఎదురెళ్లాలి.. అది ధైర్యం కాదు.. తెగింపు' అంటూ చైతు చెప్పిన డైలాగ్‌ సూపర్బ్‌గా ఉంది. 

Advertisement
CJ Advs

చైతూ డిఫరెంట్‌ లుక్స్‌, లావణ్య త్రిపాఠి హాట్‌ అప్పీరియన్స్‌, శ్రీకాంత్‌ విలనిజం స్పెషల్‌ అట్రాక్షన్స్‌గా కనిపిస్తున్నాయి. ఈ టీజర్‌ విజువల్స్‌ని చూస్తేనే దర్శకుడి టాలెంట్‌ తెలిసిపోతోంది. 'పెళ్ళి చూపులు'ఫేమ్‌ వివేక్‌ సాగర్‌ అందించిన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఈ టీజర్‌కి బాగా ఎలివేట్‌ కావడానికి దోహదం చేసిందనే చెప్పాలి. ఇక టెక్నాలజీని వాడుతూ, డ్రోన్స్‌ అండ్‌ అగ్మెంటెడ్‌ రియాల్టీ కళ్లద్దాలను చూపించడం చాలా కొత్తగా ఉంది. 

మొత్తానికి అభిరుచి ఉన్న నిర్మాత సాయి కొర్రపాటి నమ్మకాన్ని కొత్త దర్శకుడు కృష్ణ RV మరిముత్తు నిలబెట్టాడనే నమ్మకాన్ని ఈ టీజర్‌ కలిగిస్తోంది. ఇక ఈ చిత్రంతో 'ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుక చూద్దాం'ల తర్వాత 'యుద్దం శరణం' తో చైతు హ్యాట్రిక్‌ కొట్టడమే కాదు.. తన యాక్షన్‌ కలలను సాకారం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని స్పష్టంగా ఈ టీజర్‌ని చూస్తేనే అర్ధమవుతోంది. 

Yuddham Saranam Movie Teaser Released:

Naga Chaitanya starring movie 'Yuddham Saranam' Director by Krishna RV Marimuthu this movie Teaser released today 31st  july 2017.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs