Advertisement
Google Ads BL

ఈ కలెక్షన్స్ తో అందరిని 'ఫిదా' చేస్తోంది..!


విడుదలైన 10 రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్‌ వద్ద 'ఫిదా' జోరుతగ్గలేదు. తెలంగాణ సంప్రదాయాలు, భాష, యాసలతో తీసినప్పటికీ ఈ చిత్రాన్ని ఏపీలో, అమెరికాలో కూడా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ శని, ఆదివారాలలో అమెరికాలో ఈ చిత్రం కలెక్షన్లు 50 శాతానికి పైగా పెరిగాయి. ఇక ఈ చిత్రం అమెరికాలో రెండు మిలియన్‌ క్లబ్‌ దిశగా పయనిస్తోంది. మొత్తంగా ఈ చిత్రం 10రోజుల తర్వాత 50కోట్ల క్లబ్‌లో స్థానం సాధించింది. 

Advertisement
CJ Advs

మెగా హీరో వరుణ్‌తేజ్‌కి ఇదే మొదటి 50కోట్ల సినిమా కావడం విశేషం. ఇక ఈ చిత్రంలో భానుమతిగా నటించిన సాయి పల్లవి ప్రస్తుతం అందరి నోటా నామస్మరణగా మారింది. మెగాహీరోలకు కంచుకోటైన నైజాంలో ఈ చిత్రం ఇప్పటి వరకు 10కోట్లకు పైగానే వసూలు చేసిందన ట్రేడ్‌ అనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్శ్‌తో పాటు రమేష్‌బాలా పేర్కొన్నారు. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్‌వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. రోజురోజుకు స్ట్రాంగ్‌ అవుతూ, థియేటర్ల సంఖ్యను కూడా గణనీయంగా పెంచుకుంటోంది. 

మొత్తానికి 'ఫిదా' చిత్రం మరోసారి సినిమాలో ఉండే కంటెంట్‌ పవర్‌కు, సరైన కంటెంట్‌ ఉంటే ఏ చిత్రమైనా ఘన విజయం సాధిస్తుందనే దానికి చక్కని ఉదాహరణగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ఇక ఇందులో నటించిన వరుణ్‌తేజ్‌, సాయిపల్లవితో పాటు వరుణ్‌ అన్నయ్యగా రాజా, సాయిపల్లవి అక్కగా శరణ్యదిలీప్‌, సాయిపల్లవి, శరణ్యదిలీప్‌ల తండ్రిగా ఒకనాడు హీరోగా వెలిగి, చిరంజీవితో కలిసి వంశీ 'మంచు పల్లకి'లో హీరోలలో ఒకడిగా నిలిచి, 25 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సాయిచంద్‌, సాయిపల్లవి అత్తగా నటించిన 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ తల్లి గీతా భాస్కర్‌ వంటి అందరూ తమ పాత్రలకు జీవం పోశారు. ఇక పెళ్లి, పిల్లలు లేని సాయిచంద్‌ తండ్రి పాత్రలో ఇరగదీశాడనే చెప్పాలి. 

Fidaa to Collect Rs.50 Crores?:

Mega Prince Varun Tej's Fidaa has become a stupendous hit at the box office. The film has breached $1.5M at US box office by Saturday.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs