Advertisement
Google Ads BL

బిగ్ బాస్ లోకి కొత్తందం..అదేంలేదన్న సంపూ!


ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వస్తున్న బిగ్ బాస్ షో నుండి గత వారం పార్టిసిపేట్ సంపూర్ణేష్ బాబు హౌస్ లో పెద్ద సీన్ క్రియేట్ చేసి.... ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మరీ బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే సంపూ ఆ షో నుండి బయటికి వచ్చేశాక బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించాడు కాబట్టి బిగ్ బాస్ నిర్వాహకులు వేసే ఫెనాల్టీ సంపూ కట్టాల్సిందే అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అలాగే సంపూ కట్టిన డిపాజిట్ కూడా వదులుకోవాలని... తిరిగి 16  లక్షలు బిగ్ బాస్ షో నిర్వాహకులకు సంపూర్ణేష్ కట్టాలనే ప్రచారమూ జోరుగా జరిగింది.

Advertisement
CJ Advs

అయితే సంపూ షో నుండి బయట పడ్డాక ఎన్టీఆర్ ని పర్సనల్ గా కలిసి సారీ చెప్పి మరీ... మళ్ళీ బిగ్ బాస్ స్టేజి మీదకి ఎన్టీఆర్ తో కలిసి.. ఆదివారం దర్శనమిచ్చి ప్రేక్షక దేవుళ్ళకి నా క్షమాపణలు అంటూ హడావిడి చేశాడు. అలాగే మనకో కష్టమొచ్చినప్పుడు మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో...మీరే నా బిగ్ బాస్ అన్న గారు అంటూ... ఈ షోలో ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్ బాస్ వారికి స్టార్ మా ఛానల్ వారికి కృతజ్ఞతలు అని చెప్పిన సంపూ..  పెనాల్టీ లాంటివి కేవలం పుకార్లు మాత్రమే అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.

అలాగే ఈ షో లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా లక్ష్మి మంచు గాని, తేజస్వి గాని, హంస నందిని గాని ఎంటర్ అవుతుందని ఊహించిన ప్రేక్షకులకి బిగ్ బాస్ స్టేజి మీద దీక్షా పంత్ ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ కి గురి చేసింది. దీక్షా పంత్ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలేమి ఆమెకి పేరు తీసుకురాలేకపోయి.... అవకాశాలు తగ్గడంతో ఆమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో 55  రోజులు ఉండడానికి రెడీ అయ్యింది. మరి ఇప్పటి వరకు చూసిన కంటెస్టెంట్స్ ఈ బిగ్ బాస్ షోకి ఎలాంటి క్రేజ్ తీసుకురాలేకపోయారు. మరి ఇప్పుడు దీక్షా పంత్ ఎంట్రీతో బిగ్ బాస్ షోకి కొత్త కళ వచ్చేసిందంటున్నారు. ఇకపోతే ఈ బిగ్ బాస్ హౌస్లోకి దీక్ష సోమవారం నుండి ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి దీక్ష గ్లామర్ ఈ షోకి ఏ మేర హెల్ప్ అవుతుందో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Sampoo Clarity on Walks out From Bigg Boss:

Sampoornesh Babu Out and Deeksha Panth in for Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs