Advertisement
Google Ads BL

100 కోట్లు..'పైసా వసూల్' బెట్టింగ్స్ షూరూ..!


పూరి జగన్నాధ్ - బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడమే కాదు.. దసరాకి వసున్నామని చెప్పి ఇప్పుడేమో ఇంకా ముందే వచ్చేస్తున్నామంటూ డేట్ కూడా ఎనౌన్స్ చేసేసారు. సెప్టెంబర్1 నే 'పైసా వసూల్' తో థియేటర్స్ లో సందడి చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు.

Advertisement
CJ Advs

ఇకపోతే బాలకృష్ణ 'పైసా వసూల్' స్టంపర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ స్టంపర్ యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తుంది. ఆ స్టంపర్ లో బాలకృష్ణ లుక్ కి, డైలాగ్స్ కి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పూరి మార్క్ డైలాగ్స్ తో స్టంపర్ హోరెత్తింది. అయితే ఈ స్టంపర్ లో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించాడు. కొంతమంది కి బాలయ్య వాయిస్ నచ్చలేదనే కామెంట్స్ చేసినప్పటికీ.... డైలాగ్ లోని గ్రేస్ నచ్చడంతో కామ్ అయిపోయారు. అయితే 'పైసా వసూల్' స్టంపర్ చూసిన చాలామంది ఈ సినిమా 100  కోట్ల మార్క్ ని గ్యారెంటీగా టచ్ చేస్తుందని బెట్టింగ్స్ కాస్తున్నారు. 

వారు ఇలా బెట్టింగ్స్ కాయడానికి కారణం కూడా ఉందట. బాలకృష్ణ ఇప్పటివరకు నటించిన చిత్రాలలోని నటనకు... 'పైసా వసూల్' లోని నటనకు ఎంతో వ్యత్యాసం వుంది. ఎప్పుడూ తొడగొడుతూ యాక్షన్ పండించే బాలయ్య ఈ 'పైసా వసూల్' లో మాత్రం లాలింపుగా యాక్షన్ చెయ్యడం కాస్త డిఫరెంట్ గానే వుంది. పూరి తన మార్క్ నైజాన్ని బాలకృష్ణ మీద బాగానే ప్రయోగించాడు. ఇక బాలకృష్ణ కూడా పూరి మార్క్ మేనరిజాన్ని ఒంటబట్టించుకుని ఈ సినిమాలో అదరగొట్టేసాడనే ఫీలింగ్ మాత్రం పైసా వసూల్ స్టంపర్ లో తెలిసిపోయింది.

ఒకప్పుడు పూరి జగన్నాధ్ అందగాడు మహేష్ బాబు ని 'పోకిరి'గా చూపించాడు. మహేష్ బాబుని పోకిరి కుర్రాళ్ళు ఎలా వుంటారో అలా రఫ్ లుక్ లో చూపెట్టి సక్సెస్ అయ్యాడు. 'పోకిరి' సినిమాతో పూరి అప్పుడు ఇండస్ట్రీ రికార్డులని బద్దలు కొట్టాడు. 'పోకిరి' సినిమాతో మహేష్ బాబు ఇండస్ట్రీ హీరోగా అవతరించాడు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కి కూడా 'పైసా వసూల్' తో ఒక డిఫరెంట్ హిట్ ని పూరి అందివ్వబోతున్నాడనేది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ కి జోడిగా శ్రియ, కైరా దత్, ముస్కాన్ లు నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Click Here to see the Paisa Vasool Stumper

Bettings on Balayya Paisa Vasool Movie:

Puri Jagannadh and Balakrishna movie Paisa Vasool Movie Stumper Sensation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs