ఒక నెల రోజులుగా మీడియాలో డ్రగ్స్ గురించి వస్తున్న న్యూస్ మరే ఇతర టాపిక్ ల మీద రాలేదు. ఒక స్కూల్ లేదు, కాలేజ్ లేదు సినిమా రంగం లేదు, పొలిటికల్ రంగం లేదు అన్నిటీలో ఈ డ్రగ్స్ భూతం పట్టి పీడిస్తుందని... మీడియాలో రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఒక ప్రముఖ దిన పత్రిక సినిమా సీలెబ్రిటీల పేర్లు రివీల్ చేసేసింది. సిట్ అధికారులు నోటీసులు పంపించింది ఈ 12 మంది సెలెబ్రిటీస్ కే అంటూ ఒక కథనం ప్రచురించింది. అందులో పూరి జగన్నాధ్, రవితేజ, ఛార్మి, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, శ్యామ్ కె నాయుడు, చిన్నా, నందు, తనీష్, శ్రీనివాస్ రావు, నవదీప్ లు ఉన్నారంటూ కథనాలు ప్రచారం చెయ్యడంతో ఛానల్స్ ఒక్కసారిగా ఆ 12 మంది సీలెబ్రిటీస్ మీద ఫోకస్ పెట్టింది. అయితే సదరు పత్రికకు కొంత మంది సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఫోన్స్ చేసి ఇలా చెయ్యకుండా ఉండాల్సిందంటూ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.
ఇక పోతే ఆ 12 మంది సీలెబ్రిటీస్ మాత్రమే కాదని మరి కొంత మంది బడా ప్రముఖులు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని... ఇంకొంతమందికి సిట్ నోటీసులు పంపిస్తుందనే ప్రచారం జోరుగా జరిగింది. ఇక ఆ సెలబ్రిటీస్ ని సిట్ విచారణ జరుపుతున్నపుడు కూడా కొందరు డ్రగ్స్ డీలర్లుని, గంజాయి వ్యాపారం చేసేవారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ కూడా చేశారు. ఏ ఈనేపథ్యంలోనే రెండో లిస్ట్ నోటీసులు వస్తున్నాయనే ప్రచారం జరిగినా... రెండో లిస్ట్ లో కొందరు సినిమా పెద్దలు, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల పిల్లలు ఉన్నారని.... వారి పేర్లు వెల్లడించ వద్దంటూ తమపై ఒత్తిళ్లు ఉన్నాయని సిట్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ చెప్పడం పెద్ద సెన్సేషన్ అయ్యింది.
అయితే అదిగో సెకండ్ లిస్ట్ ఇదిగో సెకండ్ లిస్ట్ అంటున్నారే గాని ఇప్పటి వరకు అది బయటికి రాలేదు. కేవలం ఇండస్ట్రీలో ఒక వర్గాన్ని టార్గెట్ చేశారని ఇప్పటికే సినిమా వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో రెండో లిస్ట్ లో బడా నాయకుల పిల్లలు, సినిమా రంగాన్ని శాసించే ప్రముఖులు ఉండడంతోనే ఇలా లిస్ట్ బయటికి రావడంలేదనే వాదన బయలుదేరింది. నిజంగానే అకున్ చెప్పినట్లు పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గి వారి పేర్లు బయటపెట్టారా? లేదంటే ధైర్యంగా ముందడుగు వేసి ప్రముఖుల పేర్లు బయట పెడతారా? అనేది ఇప్పుడు సస్పెన్సు గా మారింది.
ఇప్పటికే కొంత మంది సినిమ ప్రముఖులు తమ పేర్లు బయటికి రాకుండా మేనేజ్ చేస్తున్నారని... అందుకే సెకండ్ లిస్ట్ అంటున్నారే గాని అది బయటికి రావడంలేదంటున్నారు. ఒకవేళ ఆ బడా వ్యక్తుల పేర్లను ఎప్పటికీ బయట పెట్టకపోవచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇలాగైతే కేవలం పూరి అండ్ బ్యాచ్ ని ఈ డ్రగ్స్ వ్యవహారంలో కావాలనే ఇరికించి బలి పశువులను చేశారని అభిమానుల మాట నిజమయ్యేలాగే కనబడుతుంది. ఇకపోతే బడా ప్రొడ్యూసర్స్, బడా హీరోలు ఈ డ్రగ్స్ కేసులో ఉన్నారని అందుకే ఇలా ఇప్పుడు పోలీసులు సైలేంట్ అయ్యారని అంటున్నారు. ఇక ఆ బడా ప్రముఖుల పేర్లు ఇవే అంటూ మీడియాలో రకరకాల పేర్లు కూడా ప్రచారంలోకొచ్చాయి. ఇకముందు ఈ డ్రగ్స్ కేసు ఎలాంటి మలుపులు తిరగనుందో చూద్దాం.