Advertisement
Google Ads BL

మెగా ఫ్యామిలీలో గొడవలా..ఈ పిక్ చూసి చెప్పండి!


పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ నుండి దూరంగా వెళ్ళిపోయి తన లైఫ్ తాను చూసుకుంటున్నాడు. రేణు దేశాయ్ తో పెళ్లి వరకు మెగా ఫ్యామిలీతో సఖ్యంగా ఉన్న పవన్ ఆ తర్వాత మెగా ఫ్యామిలీని దూరం పెట్టేశాడు. ఇక అప్పటినుండి మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య చెడిందనే న్యూస్ మెగా ఫాన్స్ నే కాదు చాలామందిని షాక్ కి గురిచేసింది. అయితే అప్పటివరకు మీడియా కూడా మెగా ఫ్యామిలీ విషయాలను అంతగా హైలెట్ చేసేది కాదు. కానీ పవన్ మెగా ఫ్యామిలీకి దూరం జరిగినప్పటి నుండి వారి ఫ్యామిలిలో ఏ చిన్న విషయం జరిగినా దాన్ని మీడియా హైలెట్ చేస్తూ వచ్చేసింది. ఇక ఒకరి ఫంక్షన్ కి మరొకరు హాజరుకాకపోయినా.. వీలు కుదరక వారు ఇళ్లకు వెళ్లకపోయినా మెగా ఫ్యామిలీ న్యూస్ మీడియాలో తెగ హైలెట్ అయ్యేది.

Advertisement
CJ Advs

అయితే ఎన్ని నెగెటివ్ న్యూస్ లు మీడియాలో ప్రచారం అయినా మెగా ఫ్యామిలీ మాత్రం దాన్ని కొన్నిసార్లు సీరియస్ గా తీసుకున్నప్పటికీ మరికొన్నిసార్లు లైట్ తీసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్న వదిన విషయాల్లో ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడేవాడు. తనని తన వదినమ్మ సురేఖ తల్లిలా చూసుకుందని.... ఇలా చాలా విషయాలనే చాలాసార్లు మీడియా ముఖంగా చెప్పాడు. అయినా తమ అనుబంధాల గురించి ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్పేవాడు పవన్. కానీ మీడియా మాత్రం మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ని వదలకుండా ఫాలో అయ్యేది.

ఎప్పుడూ వారి విషయాల మీదే ఎక్కువగా ఫోకస్ చేసేది. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి కూతురి ఎంగేజ్ మెంట్ లో పవన్ కళ్యాణ్ తన వదినమ్మ సురేఖతో కలిసి ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతూ మీడియా కంట్లో పడ్డాడు. ఇపుడా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆ ఫొటోస్ లో వదిన సురేఖ గారితో ముచ్చట్లు చెబుతూ చాలా హ్యాపీ గా కనబడేటప్పటికి.... ఆ దృశ్యం మాత్రం ఎంతో చూడ ముచ్చటగా ఉందని మెగా ఫాన్స్ తెగ సంబరాలు చేసేసుకుంటున్నారు. అయితే ఈ ఎంగేజ్ మెంట్ కి చిరు వేరే కారణాలతో హాజరుకాకపోవడంతో  ఆయన స్థానంలో భార్య సురేఖ హాజరవడం.. అక్కడ  పవన్ కళ్యాణ్ తన ఫ్రెండ్ త్రివిక్రంతో కలిసి రావడం.... ఇక అక్కడ.. పవన్ కళ్యాణ్ తో వదిన సురేఖ ఆత్మీయ ముచ్చట్లు చూస్తుంటే మెగా ఫ్యామిలిలో ఎటువంటి సమస్యలు లేవనిపిస్తుంది. 

Pawan Kalyan Interacts His Vadina Surekha:

Power Star Pawan Kalyan met his Vadinamma Surekha at NTV chairman Narendra Chowdary's daughter engagement ceremony.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs