Advertisement
Google Ads BL

మహేష్ ఫ్యాన్స్ కి పండగరోజులొచ్చేశాయ్..!


మహేష్ అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అయ్యే టైం దగ్గరకొచ్చేసింది. ఇప్పటివరకు అన్ని విషయాల్లో తాత్సారం చేసిన 'స్పైడర్' డైరెక్టర్ మురుగదాస్ ఇప్పుడు స్పీడు పెంచేశాడు. సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడం.... సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో సినిమాకి పబ్లిసిటీ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే 'స్పైడర్' సెకండ్ టీజర్ వచ్చేస్తుందని చెబుతున్నారు. అది కూడా మహేష్ బర్త్ డే కానుకగా స్పైడర్ సెకండ్ టీజర్ విడుదల చేస్తున్నట్లు సమచారం.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు తాజాగా ఆగస్టు 2 సాయంత్రం 6 గంటలకు 'స్పైడర్' సాంగ్ విడుదల ఒకటి చేయబోతున్నారు. 'బూమ్ బూమ్' అనే లిరిక్స్ తో సాగే ఈపాటకి ఇప్పటికే 2 ఫ్రేమ్స్ తో కూడిన ఒక టీజర్ కూడా విడుదల చేశారు. ఇక మహేష్ ఫ్యాన్స్ కేవలం ఆడియో సాంగ్ తోనే సంబరపడక్కర్లేదు... ఆడియో సాంగ్ తో పాటే దాని మేకింగ్ కూడా రాబోతుంది. మరి మహేష్ ఫ్యాన్స్ ఇదివరకు ఫస్ట్ లుక్ కోసం, టీజర్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూసినందుకు ఇపుడు ఫుల్ ఫలితం దక్కబోతోంది.

ఇక పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ స్పైడర్ చిన్నపాటి టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ చాలా స్టైలిష్ లుక్ తో కనిపిస్తుండటంతో పాటు సంగీత దర్శకుడు హారీశ్ జైరాజ్ మ్యూజిక్ కూడా కొత్తగా అనిపిస్తోంది. మరి ఇప్పుడు పాటలతో హల్చల్ చెయ్యబోతున్న మహేష్..... ఫాన్స్ కి మాత్రం కొత్త ఉత్సాహాన్ని ప్రసాదించేసాడంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ నటిస్తుండగా.. భరత్, ఎస్ జె సూర్యలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Spyder First Audio Single on August 2:

Prince Mahesh's Spyder has been tagged as one of the most awaited movies of Tollywood. Fans have eagerly been waiting for a significant update of the movie for the past couple of days. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs