మొన్నామధ్యన ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమా టీజర్ లోని కొన్ని సీన్స్ లీకైన విషయం తెలిసిందే. అది ఎలా జరిగిందో ఎవరు లీక్ చేశారో అనే విషయాన్నీ కనిపెట్టి మరి పోలిసుల చేత అరెస్ట్ కూడా చేయించాడు 'జై లవ కుశ' నిర్మాత కళ్యాణ్ రామ్. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ చిత్రానికి సంబందించినవి ఎదో ఒకటి బయట సోషల్ మీడియాలో లీకవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న 'జై' పాత్ర పొలిటికల్ పార్టీ పెట్టి క్యాంపెయినింగ్ చేస్తున్న పిక్స్ కూడా ఇలాగే నెట్ లో లీకైన విషయం విదితమే.
అదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ 'జై లవ కుశ' సినిమాలోని ఇంట్రడక్షన్ సాంగ్ లీకైనట్లు తెలుస్తోంది.ఆ సాంగ్ నెట్ లో లీకై హల్చల్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి కానీ... ఈ విషయమై చిత్ర యూనిట్ నుండి ఎటువంటి స్పందనా లేదు. ఐయితే ఈ సాంగ్ కూడా 'జై' పాత్ర కోసం కంపోజ్ చేసినట్లు తెలుస్తుంది. ముందు కూడా 'జై' టీజర్ కి సంబందించిన సీన్స్ నెట్ లో లీకయ్యాయి. ఇక ఇపుడు కూడా 'జై' పాత్రకి సంబందించిన సాంగ్ సీన్స్ లీకైనట్టు వార్తలొస్తున్నాయి. 'జై లవ కుశ' లీకెడ్ సాంగ్ ఆన్ లైన్ లో వైరల్ అయ్యిందంటున్నారు. మరి గతంలోలా కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆ లీక్ చేసిన వ్యక్తుల మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.
డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నా , నివేత థామస్ లు నటిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 21 న విడుదలకు డేట్ ఫిక్స్ చేసుకుంది.