Advertisement
Google Ads BL

టైటిల్ భలే వెరైటీగా ఉందండి..!


ఒక సినిమా మొదలవుతుంది అంటే ఆ సినిమా టైటిల్ మీద ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తారు. ఎక్కువ సినిమాలు టైటిల్స్ మీదనే సగం హిట్టవుతుంటాయి. ఒకో సినిమా టైటిల్ అయితే సినిమా విడుదల అయ్యేవరకు జనాల నోళ్ళలో విపరీతంగా నానేటట్లు... తియ్యగా.. స్మూత్ గా ఉంటాయి. కొన్ని సినిమాలు టైటిల్స్ పెట్టగానే సగం హిట్టైపోతుంటాయి. ఇక కొన్ని టైటిల్స్ విషయానికి వస్తే టైటిల్ ని చూసే సినిమాలకు వెళ్లే పరిస్థితులు కూడా వున్నాయి. కాబట్టే సినిమాకి టైటిల్ పెట్టాలి అంటే చాలా కసరత్తులు.... డీప్ డిస్కార్షన్స్ జరుగుతుంటాయి. షూటింగ్ సగం కంప్లీట్ అయ్యాకే కొన్ని సినిమాల టైటిల్ బయటికి వస్తాయి. కొన్నిసార్లు సినిమా టైటిల్స్ చాలా సింపుల్ గా ఉంటె ఇష్టపడే ప్రేక్షకులు కొన్నిసార్లు మాత్రం పెద్దగా ఉండే బారు టైటిల్ ని ఇష్టపడుతుంటారు.

Advertisement
CJ Advs

అందుకే డైరెక్టర్స్ మరియు హీరోలు కొన్నిసార్లు పెద్ద టైటిల్స్ కే ఓటేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి రామ్ పోతినేని వచ్చేశాడు. రామ్ -  కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కుతున్న  తాజా చిత్రానికి ఓ పెద్ద ఇంట్రెస్టింగ్ టైటిల్ నే పెట్టేశారు.అయితే ఆ టైటిల్ మాత్రం భలే క్యాచీగా ఉంది అంటున్నారు. రామ్ సినిమా టైటిల్ పేరేంటో అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది కదూ.. అదేనండి వినడానికి బావున్న... 'ఉన్నది ఒక్కటే జిందగీ' అంటున్నాడు రామ్. మరి టైటిల్ వింటుంటే ఇందులో ఏదో విషయం వుంది అందుకే రామ్ ఇలాంటి టైటిల్ ని ఎంచుకున్నాడనే డౌట్ కొడుతోంది ప్రతివక్కరిలో.

ఒక వెరైటీ, ఆసక్తికర టైటిల్ పెట్టి రామ్ అందరి చూపు తన టైటిల్ మీదపడేలా చేసి సక్సెస్ అయ్యాడనిపిస్తుంది. ఇకపోతే  కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రామ్ ఇదివరకే నేను శైలజ ని తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమాలో రామ్ లుక్ కూడా కాస్త వెరైటీగా అందరికి బాగానే ఎక్కేస్తుంది. కాస్త కొత్తగా ఈసారి వెరైటీగా కనిపిస్తాడని మాత్రం రామ్ గెటప్ చూస్తుంటే క్లారిటీగా అర్ధవుతుంది. 

Hero Ram Movie Title 'Unnadi Okate Zindagi':

Hero Ram Pothineni new movie title 'Unnadi Okate Zindagi' Director by Kishore.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs