Advertisement
Google Ads BL

ఇదిగో సాంబో..ఈ రికార్డు మనదే రాస్కోరా..!


పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడోసారి తెరకెక్కుతున్న చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఇప్పటికే 100  కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని చెబుతున్న ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డు సృష్టించిందనే న్యూస్ ఇప్పుడు తెగ సర్క్యులేట్ అవుతుంది. పవన్ కొత్త చిత్రం శాటిలైట్ హక్కులు ఏ ఇతర తెలుగు సినిమా అమ్ముడుపోనంత భారీ రేటుకు అమ్ముడు పోయిందంటున్నారు. హిందీ వెర్షన్ డబ్బింగ్ హక్కులని 11 కోట్ల కి అమ్ముడై రికార్డు సృష్టించిన ఈ చిత్ర తెలుగు వెర్షన్ శాటిలైట్ హక్కుల 21  కోట్లతో ప్రముఖ ఛానల్ జెమిని సొంతం చేసుకుందంటున్నారు.

Advertisement
CJ Advs

మరి ఈ రేటు ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు సినిమాకి రాలేదని.... ఇప్పుడు పవన్ చిత్ర శాటిలైట్ హక్కులే ఆల్టైమ్ రికార్డు అని... ఈ రకంగా పవన్ సినిమా చరిత్ర సృష్టించిందనే న్యూస్ ఇప్పుడు పవన్ ఫాన్స్ ని ఖుషి ఖుషి చేస్తుంది. మరి ఈ చిత్రానికి ఇంత భారీ క్రేజ్ రావడానికి కారణం పవన్ మాత్రమే కాదు... త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో ప్రాజెక్ట్ కావడం... ఇంతకుముందు వీళ్ళ కాంబోలో తెరకెక్కిన అత్తారింటికి దారేది చిత్రం చాలా సినిమా యూట్యూబ్ లో లీకైనప్పటికీ ఆ సినిమా విడుదలైన అన్నిచోట్లా సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాదు రికార్డు కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  

ఇక ఇప్పుడు వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావడమే కాదు శాటిలైట్ మార్కెట్లోనే అదిరిపోయే రేటు రాబట్టి పవనుకున్న ఫాలోయింగ్ ని మరింత పెంచేసింది. మరి తెలుగుకి, హిందీకి కలిపి 33  కోట్లు శాటిలైట్ హక్కుల ద్వారా ఈ చిత్రానికి వచ్చింది అంటే ఈ సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ నటిస్తుండగా..... కీలక పాత్రల్లో ఖుష్బూ, ఇంద్రజ లు నటిస్తున్నారు.

Pawan Kalyan's 25th Movie Huge Satellite Rights:

 It's incredible! Power Star Pawan Kalyan's prestigious 25th venture's satellite rights were sold out to Rs.21 crores with its Telugu version alone. Gemini TV has reportedly bagged the film's satellite rights. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs