Advertisement
Google Ads BL

సుకుమార్ లో స్పీడ్ పెరిగింది.. !


సుకుమార్‌ ఒకవైపు పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా తన దూకుడు పెంచుతున్నాడు. కానీ 'కుమారి 21 ఎఫ్‌' వచ్చిన చాలా కాలానికి ఆయన నిర్మిస్తున్న రెండో చిత్రం 'దర్శకుడు' ఆగష్టు 4న విడుదల కానుంది. సినిమా వారిపై తీసిన సినిమా కాబట్టి, అందునా ఆయన ఈ చిత్రం ద్వారా తన అన్నయ్య కొడుకు అశోక్‌ని హీరోగా పరిచయం చేయనుండటం, ఇంతకాలం దర్శకునిగా ఉన్న తనకు రైట్‌హ్యాండ్‌గా చెప్పుకున్న హరిప్రసాద్‌ జక్కాని దర్శకునిగా పరిచయం చేయనుండటం తో కాస్త టైమ్ పట్టివుండవచ్చు. 

Advertisement
CJ Advs

అయితే 'కుమారి21 ఎఫ్‌'కి ప్రాణం పోసిన దేవిశ్రీప్రసాద్‌ని అతని బిజీ షెడ్యూల్‌ కారణంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా సాయికార్తీక్‌ని పెట్టుకున్నాడు. ఇక ఆడియో విషయంలో ఆయన ఎంతగా సాయికార్తీక్‌ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇక ఈ చిత్రం విడుదల కాకముందే తన సుకుమార్‌ రైటింగ్స్‌ బేనర్‌తోపాటు రేష్మాస్‌ ఆర్ట్స్‌ సంస్థను భాగస్వామ్యం చేసుకుని నిర్మాతగా మూడో చిత్రానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు సుకుమార్. 

ఇక 'కుమారి 21ఎఫ్‌' విజయంలో కీలకపాత్రను పోషించిన దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌తోనే ఆయన తన మూడో చిత్రాన్ని ప్లాన్‌ చేశాడు. ఇక ఆ చిత్రంలో నటించిన రాజ్‌తరుణే ఈ కొత్త చిత్రంలో కూడా హీరో కావడం, దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనుండటం విశేషం. ఇక హీరోయిన్‌ పాత్రలో మాత్రం హెబ్బాపటేల్‌ని కాకుండా ఆమెలాగా అందం, టాలెంట్‌ ఉన్న మరో కొత్తమ్మాయిని పరిచయం చేయనున్నారట. 

'కుమారి 21 ఎఫ్‌' తర్వాత రాజ్‌తరుణ్‌-హెబ్బాపటేల్‌లు పలు చిత్రాలలో నటించి స్టీరియోగా మారిన నేపద్యంలో కొత్త అమ్మాయిని తీసుకోవడం మంచిదే. ఇక 'కుమారి 21 ఎఫ్‌'ని కాస్త అడల్ట్‌ మూవీగా తీసిన పల్నాటి సూర్యప్రతాప్‌ ఈ నూతన చిత్రాన్ని సుకుమార్ ఇచ్చిన ఓ వైవిధ్యమైన కథతో తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది.  

Sukumar Writings 3rd Movie Announced:

Sukumar Writings Banner Third movie Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs