టాలీవుడ్ లో ఇప్పుడు డ్రగ్స్ విషయంలో మామూలు రచ్చ జరగడం లేదు. మాములుగా చిన్న నటులు ఎవరన్నా ఉంటే గనక ఇంతగా డ్రగ్స్ విషయం అంతగా హైలెట్ అయ్యేది కాదేమో... కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో టాప్ సెలబ్రిటీస్ నోటీసులు అందుకుని విచారణకు హాజరవుతుంటే.... విషయం మాములుగా లేదు అంటు మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇక మీడియా ఫోకస్ కూడా బయట విషయాల మీద పెట్టకుండా కేవలం డ్రగ్స్ విషయాన్నే హైలెట్ చేస్తూ మినిట్ టు మినిట్ అప్డేట్ తో హోరెత్తించేస్తోంది.
ఇదంతా ఇలా ఉంటే సినిమా వాళ్ళు బయట ఎక్కడ మీడియాకి దొరికినా డ్రగ్స్ కేసుల విషయంలో మీ స్పందన ఏమిటంటూ వారిని గుచ్చి గుచ్చి ప్రశ్నలతో చంపేస్తుంది. మొన్నటికి మొన్న ఏదో షాప్ ఓపెనింగ్ కి వచ్చిన సమంతని చుట్టుముట్టి డ్రగ్స్ కేసు విషయమై స్పందన కోరగా నో కామెంట్ అంటూ సమంత తప్పించుకుంది. అయితే ఇప్పుడు రానా మాత్రం మీడియా అడిగిన విషయాలకు సమాధానాలు చెప్పాడు. 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా డ్రగ్స్ వివాదం పై స్పందించాడు రానా. ఈ డ్రగ్స్ వ్యవహారంలో పెద్దవాళ్ళ మాట ఎలా వున్నా చిన్నపిల్లలు డ్రగ్స్ కి ఎడిట్ అయితే మాత్రం చాలా దారుణం అంటున్నాడు భళ్లాల దేవా.
ఇప్పుడు డ్రగ్స్ కేసులో 12 మంది నోటీసులు అందుకుని విచారణకు హాజరవుతున్న సమయంలో రానా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. స్కూల్ పిల్లలు డ్రగ్స్ కి బానిసలుగా మారడం అనేది చాలా భయంకరమైన అంశం అని.... 40 ఏళ్ళ వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడు.. అంటే ఆ విషయం లో అతడికి ఒక అవగాహన ఉంటుంది. కానీ స్కూల్ పిల్లలు గనక డ్రగ్స్ కి బానిసలుగా మారితే చాలా ప్రమాదకరం.... దాని అనర్థాల గురించి వారికి పూర్తిగా ఏమి తెలియదు. స్కూల్ పిల్లలు డ్రగ్స్ కు బానిసలుగా కాకుండా చూడడం ఇప్పుడు అందరిముందు ఉన్న కర్తవ్యం అని.... చెబుతున్నాడు రానా.