నాగ అశ్విన్ డైరెక్షన్ లో సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రం షూటింగ్ మొదలుపెట్టుకుని సెట్ మీదకి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో మహానటి టైటిల్ రోల్ ని కీర్తి సురేష్ పోషిస్తుండగా... సమంత ఒక కీ రోల్ లో నటిస్తుంది. మరి మహానటి సావిత్రి జీవితంలో నటిగా ఉన్నప్ప్పుడు, పర్సనల్ లైఫ్ లోను బోలెడన్ని మంచి,చెడు విషయాలు ఉన్నాయి. అసలు నటిగా కన్నా ఆమె పర్సనల్ లైఫ్ లోనే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంది. తమిళంలో స్టార్ట్ హీరో హోదాలో కొనసాగుతున్న జెమిని గణేశన్ ని సావిత్రి లవ్ చేసి మరీ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకోవడం.... ఆ తర్వాత ఉన్న డబ్బులు అన్ని పోగొట్టుకోవడం.... పెళ్లి తర్వాత లైఫ్ లోను అనేక రకాల ఇబ్బందులు రావడం వంటివి చాలానే జరిగాయి.
సావిత్రి లైఫ్ లో జెమిని గణేశన్ ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే ఆ మహానటి చిత్రంలో జెమిని గణేశన్ పాత్ర చెయ్యడానికి తమిళ స్టార్స్ ఎవరు ఆసక్తి చూపెట్టకపోవడంతో దర్శకుడు మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ ని మహానటి కోసం ఈ పాత్రకి తీసుకొచ్చాడు. మరి ఎంతో స్టైలిష్ లుక్ లో ఇరగదీస్తున్న దుల్కర్ ఈ మహానటిలో జెమిని గణేశన్ పాత్రలో ఎలా కనబడతాడో అనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. అయితే ఇప్పుడు దుల్కర్ బర్త్ డే సందర్భంగా మహానటి టీమ్ దుల్కర్ మహానటి లుక్ ని బయటికి వదిలింది.
మహానటిలో దుల్కర్, జెమిని గణేశన్ గా ఎలా ఉంటాడో ఈ లుక్ ని బట్టి అర్ధమైపోతుంది. మరి ఈ పిక్ చూస్తుంటే దుల్కర్ అచ్చం జెమిని గణేశన్ ఎలా ఉంటాడో అలానే కనబడి ఆశ్చర్యపరిచాడు. మహానటిలో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ లుక్ ని పరిచయం చేసిన మహానటి టీమ్ గతంలోనే కీర్తి సురేష్ మహానటి లుక్ ని, సమంత లుక్ ని కూడా విడుదల చేసేసింది. మరి అన్ని పాత్రలను సూపర్ గా తీర్చి దిద్దిన నాగ్ అశ్విన్ సావిత్రి నట జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన ఏఎన్నార్, ఎన్టీఆర్ ల లుక్స్ ని ఎలా చూపించబోతున్నాడో చూడాలి.