Advertisement
Google Ads BL

వెంకీ, ఫ్యాన్స్‌ని ఎప్పుడు తృప్తి పరుస్తాడో..?


తెలుగు ఇండస్ట్రీలోని నేటి సీనియర్‌స్టార్స్‌లో ఎవరికైనా కథలు, దర్శకుల కొరత ఉంటుందేమో గానీ వెంకీకి ఉండదు. అటు సీనియర్‌ డైరెక్టర్లు, ఇటు యంగ్‌ అండ్‌ యూత్‌ టాలెంట్‌తో పని చేయడానికి కూడా ఆయన ఎప్పుడూ సిద్దంగానే ఉంటాడు. అలాగే ఎలాంటి పాత్రనైనా తన ఇమేజ్‌ ఛట్రంలో ఆలోచించకుండా డిఫరెంట్‌ అనిపిస్తే ఓకే చేస్తేస్తాడు. ఇక ఆయన మరోకన్ను ఏయే భాషల్లో ఏయే చిత్రాలు విడుదలవుతున్నాయి?ఏవి హిట్టవుతున్నాయి? తనకు తగ్గ పాత్రలు ఏంటి? అనే వాటిపై కూడా ఆయనకు స్పష్టమైనక్లారిటీ ఉంది. 

Advertisement
CJ Advs

ఎవరితో కలిసి నటించడానికైనా సిద్దంగా ఉంటాడు. మరోపక్క సోదరుడు సురేష్‌బాబు ఉన్నాడు. కానీ ఈ మద్య కారణం ఏమిటోగానీ విక్టరీ వెంకటేష్‌ మౌనంగా, అందరికీ దూరంగా ఉంటున్నాడు. ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడు కావడంతో అందరూ దానిని కూడా అర్ధం చేసుకుంటున్నారు.ఇక ఆయన నటించిన 'గురు'చిత్రం విడుదలై నాలుగైదు నెలలు కావస్తోంది. ఆ చిత్రం ప్రమోషన్‌లో కూడా యాక్టివ్‌గా పాల్గొనలేదు. లేకుంటే ఇంకాస్త బెటర్‌ రిజల్ట్‌ వచ్చేది. 

మరో వైపు ఆయన తండ్రి ఉన్నంత కాలం వేగంగా చిత్రాలు తీసిన సురేష్‌బాబు కూడా వెంకీలాగానే స్లో అయ్యాడు. ఇక ఆయన నాడు 'నేను..శైలజ' ఫేమ్‌ కిషోర్‌ తిరుమలలో 'ఆడాళ్లు.. మీకు జోహార్లు' అనౌన్న్‌ చేసి మరీ తర్వాత ఆ సంగతి పట్టించుకోలేదు. ఇంతలో పూరీతో మహేష్‌తో చేయాలనుకున్న 'జనగణమన' అనే దేశభక్తి చిత్రం చేయనున్నాడని, కానీ బడ్జెట్‌ తన రేంజ్‌కి మించుతుందనే ఉద్దేశ్యంతో కామ్‌ అయ్యాడని వార్తలు వచ్చాయి. 

కాగా ప్రస్తుతం పూరీ బాలయ్యతో 'పైసా వసూల్‌', కిషోర్‌ తిరుమల రామ్‌తో బిజీగా ఉన్నారు. మరి వీరి చిత్రాల రిజల్ట్‌ తర్వాత వెంకీ తుది నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. సీనియర్‌ స్టార్‌ బాలయ్యతో 'పైసా వసూల్‌'తో పూరీ హిట్‌ కొడితే మాత్రం పూరీతో వెంకీ చిత్రాన్ని ఫైనల్‌ అనుకోవచ్చని అంటున్నారు. ఏదైనా వేచిచూడాల్సిందే..! 

Venkatesh Next Project With Puri Jagannadh?:

Puri hits with senior star Balayya's 'Paisa Vasool', saying that it is possible to finalize a Venky film with Puri.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs