Advertisement
Google Ads BL

హరే.. రామ..రామా.. ఏంటయ్యా ఇలా..!


మన హీరోలకి చేస్తే అతివృష్టి... చేయకపోతే అనావృష్టి అన్నట్లుగా ఉంటుంది వారి తీరు. చేస్తే వరుస చిత్రాలతో వస్తారు.. లేకపోతే లాంగ్‌గ్యాప్‌ తీసుకుంటారు. అందులోనే కాదు డైరెక్టర్లతో కూడా చేస్తే వరుసగా పెద్ద దర్శకులతో చేస్తారు.. లేకపోతే వరసగా కొత్తవారితో, యంగ్‌ టాలెంట్‌తో ముందకుపోతుంటారు. ఇక గెటప్‌, లుక్‌ల విషయంలో కూడా వారిది ఇదే పంథా, చేస్తే మరీ పూర్తిగా మేకోవర్‌ అయి బాడీలాంగ్వేజ్‌ నుంచి గడ్డం, హెయిర్‌స్టైల్స్‌, సిక్స్‌ప్యాక్‌లంటారు. 

Advertisement
CJ Advs

లేకపోతే ఓకే మూసలో అన్ని చిత్రాలలో కనిపిస్తూ సినిమా టైటిల్‌ చెబితే ఫలానా చిత్రంలోది కదా...! ఈ స్టిల్‌ అని గుర్తించలేని విధంగా కనిపిస్తారు. ఇక ఇప్పుడిప్పుడే మన సీనియర్‌ స్టార్స్‌ నుంచి యంగ్‌ హీరోల వరకు మేకోవర్‌పై దృష్టిపెడుతున్నారు.'పైసా వసూల్‌'లో బాలయ్య కేక పెట్టించే స్టైల్‌లో కనిపిస్తుంటే, చిరంజీవి 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కోసం నానా కొత్త లుక్‌లకి ట్రై చేస్తున్నాడు. ఇక వెంకీ 'గురు'లో, నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ'లలో డిఫరెంట్‌గా కనిపించారు. రామ్‌ చరణ్‌ సుక్కు చిత్రం కోసం, నితిన్‌ 'లై', రానా 'నేనే రాజు నేనే మంత్రి'..రవితేజ 'రాజా ది గ్రేట్‌', ఎన్టీఆర్‌ 'జై లవకుశ', మహేష్‌ 'స్పైడర్‌, భరత్‌ అనే నేను, అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'ఇలా మేకోవర్‌, స్టైల్స్‌పై దృష్టిపెడుతున్నారు. 

ఇక శ్యాంప్రసాద్‌రెడ్డి కూతురి వివాహంలో యంగ్‌ హీరో రామ్‌ డిఫరెంట్‌గా కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. గెడ్డం, బాగా పెరిగి పాపిడి తీసి సైడ్‌కి పెంచిన జుత్తులో డిఫెంట్‌గా ఉన్నాడు. ఇక ఆయన కరుణాకరన్‌ చిత్రాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం 'నేను శైలజ' చేసిన కిషోర్‌ తిరుమల చిత్రంలో ఆయన ఇదే గెటప్‌తో ఆకట్టుకోనున్నాడని అంటున్నారు. 'హైపర్‌'తో పవర్‌ పోగొట్టుకున్న ఈ యంగ్‌ హీరో తనకు 'నేను.. శైలజ'తో బ్రేక్‌నిచ్చిన కిషోర్‌ తిరుమల చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, ఆయనలో కనిపిస్తున్న కొత్తదనం చూస్తే తెలుస్తుంది. మరి కొత్తదనం తన గెటప్‌తో పాటు సినిమా కథలో కూడానా? లేదా? అనేది తెలియాలంటే చాలా కాలం వెయిట్‌ చేయకతప్పదేమో...!

Hero Ram New Look For New Movie:

Hero Ram New different Look in Shyam Prasad Daughter Marriage.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs