Advertisement
Google Ads BL

తెలుగులో మలయాళ బామలు దున్నేస్తున్నారు!


ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మలయాళ భామల జోరు ఎక్కువైంది. సీజన్ కి ఒకరు చొప్పున టాలీవుడ్ లో కి అడుగుపెడుతున్నారు. ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరన్ అ..... ఆ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు ఫిదా తో సాయి పల్లవి టాలీవుడ్ ని దున్నేస్తుంది. వీరిద్దరూ మలయాళ ప్రేమంలో నటించినవారే కావడం విశేషం. ఇక వీరిద్దరికి సాయి పల్లవికి, అనుపమ పరమేశ్వరన్ కి ఫుల్ గా మలయాళంలో క్రేజ్ తెచ్చిన దర్శకుడు ఆల్తాఫ్. అతనివల్లే అనుపమ, సాయి పల్లవులు ఇపుడు తెలుగు తెరమీద జోరు చూపిస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడా దర్శకుడు ఐశ్వర్య లక్ష్మి అనే కొత్త అమ్మాయిని మలయాళ వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. ఐశ్వర్య లక్ష్మి.... వృత్తి పరంగా డాక్టర్..కానీ ప్రవృత్తి మాత్రం మోడల్. ఈ అమ్మాయిని ప్రేమమ్ డైరెక్టర్ ఆల్తాఫ్ ప్రేమమ్ హీరో నివీన్ పౌలీ సరసనే కొత్త సినిమాలో ఛాన్స్ ఇస్తున్నాడు. మరి ఐశ్వర్య లక్ష్మి సినిమా మలయాళంలో అలా మొదలైందో లేదో అప్పుడే ఆమెకు తెలుగులో చాన్స్ వచ్చేసింది అనే ప్రచారం జరుగుతుంది. మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి.. సినిమా తరువాత హీరో కళ్యాణ్ రామ్ చేయబోయే కొత్త  సినిమాలో ఐశ్వర్య లక్ష్మిని  హీరోయిన్ గా ఎంపిక చేశారని వార్తలొస్తున్నాయి. 

మరి ప్రేమమ్ హీరో, డైరక్టర్ తో సినిమా చేస్తుంది అంటే  తెలుగు ప్రేక్షకుల దృష్టి ఐశ్వర్య లక్ష్మి మీద పడే అవకాశం ఉండడంతో..ఆమె ప్రొఫైల్  కళ్యాణ్ రామ్ దృష్టికి వెళ్ళగానే కళ్యాణ్ రామ్ వెంటనే ఓకె చేశాడనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్ లో వినబడుతుంది. కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు నిర్మాతలు కూడా అప్పుడే వాళ్ల సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు చెబుతున్నారు.

Aishwarya Lakshmi Entry in Tollywood:

Aishwarya Lakshmi is the heroine in the new movie 'Kalyan Ram'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs