Advertisement
Google Ads BL

రవితేజ పై ప్రశ్నల వర్షం ఫ్యాన్స్ ఆందోళన!


డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిలో అందరికన్నా ఎక్కువ ఫలితాన్ని అనుభవించబోతుంది మాత్రం హీరో రవితేజ. రవితేజ డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్నా అప్పటి నుండి మౌనంగా వున్నా ఆయన ఈ రోజు శుక్రవారం సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. ఇక సిట్ ముందు హాజరయిన రవితేజని సిట్ అధికారులు మిగతా వారిని వేసిన ప్రశ్నలనే వేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు డ్రగ్స్ డీలర్ కెల్విన్, మరో నిందితుడు జీషాన్ లతో ఉన్న లింక్ పై గుచ్చిగుచ్చి రవితేజని  అడిగినట్టు సమాచారం. అలాగే మీ సోదరులతో మీకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా ? అసలు మీకు కెల్విన్, జీషాన్ ఎప్పటి నుంచి పరిచయం? వంటి ప్రశ్నలతో రవితేజని సిట్ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే సమాచారం అందుతుంది.

Advertisement
CJ Advs

అలాగే సిట్ అధికారులు రవితేజతో కెల్విన్, జిషన్ లను ఏ  పరిస్థితుల్లో మీరు కలిశారు. వాళ్ళతో కలిసి పబ్ లకు వెళ్తుంటారా.. ఇక మీ డ్రైవర్ శ్రీనివాస రాజుతో డ్రగ్స్ తెప్పించుకునేవారా..? ఆయనతో మీరు డ్రగ్స్ వ్యాపారం చేయిస్తున్నారా? ఇక ఈ కేసులో నోటీసులు అందుకుని విచారణకు హాజరయిన పూరీతో మీ పరిచయం ఎప్పటినుంచి.. ఛార్మి తో కూడా మీకు ఎప్పటినుండి పరిచయం.... అంటూ సిట్ అధికారులు  రవితేజను ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.

ఇక ఇప్పుడు సిట్ కార్యాలయంలో ప్రశ్నలు ఎలా ఉన్నప్పటికీ బయట మాత్రం రవితేజ అభిమానులు హంగామా సృష్టిస్తున్నారు. తమ అభిమాన హీరోను ఈ డ్రగ్స్ కేసులో కావాలని ఇరికిస్తున్నారని.... ఆయనకు డ్రగ్స్ వ్యాపారం చెయ్యాల్సిన అవసరం లేదని.... ఆయనెంతో మంచివాడంటూ అభిమానుల ఆందోళన సిట్ కార్యాలయం ఎదుట అంతకంతకు ఎక్కువవుతోంది. తమ అభిమాన హీరో ఎంతో కష్టపడి పైకి వచ్చాడని.... ఆయనకు డ్రగ్స్ తీసుకోవలసిన అవసరం లేదని వారు వాదిస్తున్నారు. ఇక అక్కడ పరిస్థితి కంట్రోల్ లోకి తెచ్చేందుకు పోలీసులు నానా హైరానా పడుతున్నారు. అలాగే సిట్ ఆఫీస్ ఎదుట భద్రతను కట్టు దిట్టం చేశారు.

SIT Team Quiz Telugu Top Actor Ravi Teja:

Hyderabad drug case SIT team quiz Telugu top actor Ravi Teja 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs