సాయి పల్లవికి కథ నచ్చితేనే సినిమాల్లో నటిస్తుంది. కథలో తన పాత్ర నచ్చితేనే సినిమాలకు సైన్ చేస్తుంది. లేకుంటే ఎన్నికోట్లు ఇచ్చినా ఆ సినిమాలో నటించదు. ఇప్పటికే మణిరత్నం, గౌతమ్ మీనన్ సినిమాల ఛాన్స్ లు వదులుకుందనే టాక్ ఉండనే వుంది. అయితే సాయి పల్లవి నటనలో ఆణిముత్యం వంటిది. ప్రేమమ్ లో మలార్ కి, ఫిదాలో భానుమతికి అందరూ ఫ్యాన్స్ కావాల్సిందే. అంతలా తన పాత్రలకు ప్రాణం పోస్తుంది సాయి పల్లవి. ఫిదాకు ముందే సాయి పల్లవికి తెలుగులో అవకాశాలు వచ్చినట్టు ప్రచారం జరిగినా కూడా సాయి పల్లవి ముందుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ నే ఓకె చేసింది.
ఇక ఫిదాలో భానుమతి కేరక్టర్ లో ఇరగ్గొటేసిన సాయి పల్లవికి టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయట. కేవలం అవకాశాలు మాత్రమే కాకుండా కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి మరి తమ సినిమాల్లో బుక్ చేసుకోవాలనే ఆసక్తిని టాలీవుడ్ నిర్మాతలు చూపిస్తున్నారట. మరో పక్క అడ్వాన్స్ గా కోటి రూపాయల ఆఫర్ ఇచ్చినప్పటికీ సాయి పల్లవి వాటిలో ఏ ఒక్కదానికి కమిట్ అవ్వలేదని అంటున్నారు. ఇకపోతే మళ్ళీ దిల్ రాజు నిర్మాణంలోనే ఎంసీఏలో నాని కి జోడిగా నటిస్తున్న సాయి పల్లవి, నాగ సౌర్య పక్కన మరో మూవీలో నటిస్తుంది.
అయినా వచ్చిన అవకాశాలను దండుకోకుండా ఇలా డబ్బులు సంపాదించడానికి నేను ఇండస్ట్రీకి రాలేదని.... ఉన్నతమైన పాత్రలు పోషించి..... చేసిన కొన్ని చిత్రాలతో అయినా జీవిత కాలం గుర్తుండిపోవాలని అనుకున్నట్టు చెబుతుంది ఈ డాన్సింగ్ భామ.