Advertisement
Google Ads BL

పూరీ సూపరైతే. బాలయ్య సూపర్‌ డూపర్‌!


తనపై డ్రగ్స్‌ విచారణ వచ్చిన తర్వాత కాస్త ఆవేదన చెందిన పూరీ జగన్నాథ్‌ దాని ఎఫెక్ట్‌ ఎక్కడా పడకుండా జాగ్రత్తపడుతున్నాడు. బాలయ్య 'పైసా వసూల్‌' స్టంపర్‌ని విడుదల చేసి నందమూరి అభిమానుల జేజేలు అందుకుంటున్నాడు. విడుదలైన వెంటనే సోషల మీడియాలో దీనికి విపరీతమైన వ్యూస్‌ వస్తున్నాయి. దీంతో పూరీ డ్రగ్స్‌ ఎఫెక్ట్‌ తన దర్శకత్వం విషయంలో పడకుండా మెయిన్‌టెయిన్‌ చేసి ఈ కేసు విచారణ నుంచి ఆయన అందరి దృష్టిని తన 'పైసా వసూల్‌'వైపు తిప్పుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక నితిన్‌ సోదరితో కలిసి శ్రేష్ఠ్‌మూవీస్‌ బేనర్‌లో 'ఇష్క్‌, గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాలలో నిర్మాణభాగస్వామిగా ఉండి తాజాగా కాల్పులలో తృటిలో బయటపడిన విక్రమ్‌ గౌడ్‌ని ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో పరామర్శించాడు ఆయన శరీరంలోంచి తూటాలను డాక్టర్లు తొలగించారు. ఈయనను పరామర్శించడం ద్వారా పూరీ తన డ్రగ్స్‌ ఆరోపణల ఎఫెక్ట్‌ని తన పర్సనల్‌ లైఫ్‌, ఇతరులతో సంబంధాలపై కూడా ప్రభావం పడకుండా చూసుకున్నాడనే చెప్పవచ్చు. 

ఇక పూరీ 'స్టంపర్‌'ని చూసిన దర్శకుడు వర్మ తన ప్రియశిష్యునిపై, బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించాడు. 'సూపర్‌... సూపర్‌.. డూపర్‌' అని తన ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపాడు. బాలయ్య సూపర్‌ అంటూ కితాబిచ్చేశాడు. తన జీవితంలోనే బాలయ్యని తొలిసారిగా ఎంతో ప్రేమిస్తున్నానని అన్నాడు. ఈ విషయాన్ని మొదటి సారి ప్రేమిస్తున్నాను... అని చెప్పడం ద్వారా ఇంతకు ముందు బాలయ్య చిత్రాలు తనకు నచ్చలేదని చెప్పకనే నిజాయితీగా చెప్పేశాడు. ఇక ప్రస్తుతం ఆయన ట్విట్టర్‌ నుంచి బయటకు రావడంతో ఫేస్‌బుక్‌ ద్వారా తన ఫీలింగ్స్‌ని వెళ్లడించాడు. 

Ram Gopal Varma Compliments to Balakrishna:

Ram Gopal Varma Compliments to Balakrishna movie Paisa Vasool Stumper.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs