Advertisement
Google Ads BL

కమల్ చిన్న కూతురు అంత పని చేసిందా..?


మొత్తానికి 'మనం'చిత్రం అక్కినేని ఫ్యామిలీకి ఫ్యామిలీ మూవీ అయినట్లుగానే ఇతర సినిమా ఫ్యామిలీలు కూడా తమ కుటుంబ చిత్రాలను చేయాలని ఆశపడుతున్నాయి. తాజాగా లోకనాయకుడు కమల్‌ హాసన్‌ చిన్న కూతురు అక్షర హాసన్‌ అదే ఆసక్తిని వెళ్లడించింది. అక్షర హాసన్‌కి డైరెక్షన్‌ అంటే ఎంతో ఇష్టం. ఆమె తన తండ్రి దర్శకత్వంలో ఆయన, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్న 'శభాష్‌ నాయుడు'కి దర్శకత్వశాఖలో పనిచేస్తోంది. 

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రం తాత్కాలికంగా వాయిదాపడింది. మరోవైపు దర్శకత్వంలో ఇంట్రస్ట్‌ ఉన్న ఈ చిన్నది 'షమితాబ్‌' చిత్రంతో బాలీవుడ్‌కి నటిగా పరిచయమైంది. ఇక తాజాగా ఆమె కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్‌ మూవీ 'వివేగం'లో ఓ కీలక పాత్ర ద్వారా కోలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. కాగా ఈమె ఇటీవల బౌద్దమతంలోకి మారింది. దీని గురించి ఈమె చెబుతూ, నా తండ్రి, సోదరిలాగే నేను కూడా నాస్తికురాలిని. నాకు దేవుడి మీద నమ్మకంలేదు. దాంతో బౌద్దమతంపై ఉన్న ఆసక్తితో ఆ మతం పుచ్చుకున్నానని తెలిపింది. 

ఇక తన తండ్రి, సోదరి,తల్లి, బందువులు అందరూ నటనలోనే ఉండటంతో తాను దర్శకురాలిగా నిరూపించుకున్న తర్వాత తన ఫ్యామిలీ చిత్రం కోసం తన తండ్రిని, అక్కని కాల్షీట్స్‌ అడుగుతానని, కానీ ముందుగా తాను దర్శకురాలి ప్రూవ్‌ అవ్వాలి అని తెలిపింది. ఇక తన తండ్రి కమల్‌ హాసన్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఆమెను అడిగితే ఏమో.. ఆయనకి ఏది నచ్చితే అది చేస్తారు. దానిపై నేను స్పందించలేను అని తెలివిగా సమాధానాన్ని దాట వేసింది. ఇక 'వివేగం' చిత్రం ఆగష్టు 10 వ తేదీన విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఆమెకు మాతృభాషల్లో ఎలాంటి ఫలితాన్ని నటిగా ఉవ్వనుందో వేచిచూడాల్సివుంది..! 

Actress Akshara Haasan:

Akshara Haasan, daughter of Kamal Haasan is back in news not for movies. she has recently developed faith towards Buddhism and has converted to Buddhist.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs