Advertisement
Google Ads BL

సాయిధరమ్ ఈ రకంగా కూడా వాడేస్తున్నాడు!


సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బివిఎస్ రవి దర్శకత్వంలో ‘జవాన్’ చేస్తున్నాడు. 'జవాన్' సినిమా సెట్స్ మీదుండగానే వి.వి వినాయక్ తో ఒక సినిమాకి కమిట్ అయిన సాయిధరమ్ తేజ్.. ఇప్పుడు మరో కొత్త సినిమాపై దృష్టి సారించాడనే వార్తలు ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు ఎడా పెడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు సాయి... యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతితో ఒక సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ కాంబినేషన్ లోని మూవీ అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఇక వీరి కాంబినేషన్ ఇంకా పక్కాగా సెట్ కాకుండానే ఈ చిత్రానికి టైటిల్ ని మెగాస్టార్ చిరు హిట్ మూవీ టైటిల్ 'మహానగరంలో మాయగాడు' అని పెడితే బాగుంటుందనే ఆలోచనలో మారుతి అండ్ టీమ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ మేనమామల స్టైల్స్ ని, పాటలని, డైలాగ్స్ ని వాడేస్తూ ఇప్పుడు ఏకంగా మేనమామ చిరు టైటిల్ నే పెట్టేస్తున్నాడన్నమాట.

అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కానీ మారుతీ - సాయి ధరమ్ కాంబినేషన్ లో సినిమా మాత్రం పక్కాగా ఉంటుందని మాత్రం చెబుతున్నారు. ఇక సాయి మేనమామ టైటిల్ పెట్టుకుంటాడా? లేదా అనేది మాత్రం అస్సలు క్లారిటీ లేదంటున్నారు.

Sai Dharam’s film has Chiru’s title:

Sai Dharam Tej, who is currently shooting for Jawaan, has signed up for yet another action comedy, which is being directed by Maruthi, say reports. According to a source, the film has been titled Mahanagaramlo Mayagadu, the title of Chiranjeevi’s yesteryear hit directed by Vijaya Bapineedu.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs