Advertisement
Google Ads BL

నాని తో సినిమానా..? అంత లేదక్కడ!


కళ్యాణ్ రామ్ ఇప్పుడిప్పుడే లైన్ లో పడుతున్నాడు. ఎప్పుడూ సినిమాలు నిర్మిస్తూ, హీరోగా సినిమాలు చేస్తూ డబ్బు పోగొట్టుకుంటున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు కాస్త లైన్ లో కొచ్చాడంటున్నారు. అనడం కాదు కళ్యాణ్ రామ్ చేస్తున్న పనులు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఇప్పటివరకు తన సినిమాలను తానే నిర్మించుకుని హీరోగా నటించేస్తూ ప్లాపులతో బోల్తాపడ్డ కళ్యాణ్ రామ్ ఇప్పుడు బయట నిర్మాతలకు సినిమా చేస్తున్నాడు. అలాగే తాను నిర్మాతగా బయటి హీరో అంటే తమ్ముడు ఎన్టీఆర్ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ లెక్కన కళ్యాణ్ రామ్ కాస్త ముందు చూపు చూస్తున్నట్టే కనబడుతుంది. 

Advertisement
CJ Advs

తాజాగా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ జై లవ కుశ తర్వాత మరో మినిమమ్ గ్యారెంటీ హీరోతో ఒక సినిమా నిర్మించబోతున్నాడనే టాక్ సోషల్ మీడియా సర్కిల్స్ లో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని తో కళ్యాణ్ రామ్ ఒక సినిమాకి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ న్యూస్ కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లగా ఆ క్షణం కళ్యాణ్ రామ్ ఆశ్చర్యపోయాడట. అసలు నాకు ఇటువంటి ఆలోచనే లేదు కానీ ఈ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయ్యిందంటూ ఆశ్చర్యపోయాడట. మరి కళ్యాణ్ చెప్పినట్లే నాని రెండు మూడు సినిమాలతో మరో రెండేళ్లు డైరీ ఫుల్ చేసుకుని ఉన్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా నిర్మాతగా, హీరోగా దూసుకుపోతున్నాడు.

ప్రస్తుతం తమ్ముడు ఎన్టీఆర్ జై లవ కుశ ని నిర్మిస్తున్న కళ్యాణ్ రామ్ మరోపక్క హీరోగా రెండు సినిమాల్లో చేస్తున్నాడు. అందులో మంచి లక్షణాల ఉన్న అబ్బాయి ఒకటి కాగా మరొకటి  ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది.

Kalyan Ram reacted on Movie with Nani:

Kalyan Ram About Movie with Nani in his Production
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs