Advertisement
Google Ads BL

పవన్‌ బల్గేరియా.. మహేష్‌ రొమేనియా..!


మొత్తానికి మన హీరోలు ఇప్పుడు యూరప్‌ వైపు ఎక్కువగా చూస్తున్నారు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ తాను నటిస్తున్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌- హారిక అండ్‌ హాసిని బ్యానర్ లో నటిస్తున్న చిత్రంలోని పాటల కోసం బల్గేరియా వెళ్లాడు. తన వెంట తన భార్య, పాపతో పాటు రేణుదేశాయ్‌-తనకు పుట్టిన అకీరానందన్‌, ఆద్యాలను కూడా ఫ్యామిలీ అకేషన్‌ కింద అక్కడికి తీసుకెళ్లాడు. ఇక పవన్‌ అక్కడికి వెళ్లాడో లేదో ఆగష్టు2 నుంచి 8వ తేదీ వరకు ఓ పాట చిత్రీకరణ కోసం మహేష్‌ బాబు-రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు మురుగదాస్‌తో కలిసి రుమేనియా వెళ్లనున్నారు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం 'స్పైడర్‌' టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్స్‌ కూడా విడుదలై చాలాకాలం అయింది. ఈమద్య మే 31న తన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ జన్మదినోత్సవం కానుకగా ఈ చిత్రం తొలి టీజర్‌ విడుదలైంది. అయితే ఇది సినిమాలో లేని ఓ సీన్‌ని చిత్రీకరించి విడుదల చేశారు. ఇక ఆగష్టు 9న మహేష్‌ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రంలోని సినిమా సీన్స్‌తో ఉన్న రెండో టీజర్‌ని విడుదల చేయనున్నారు అదే సమయంలో మహేష్‌ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న రెండో చిత్రం 'భరత్‌ అనే నేను'చిత్రంలోని యంగ్‌ సీఎం ఫస్ట్‌లుక్‌ని కూడా అదేరోజు విడుదల చేయనున్నారు. 

ఇప్పటి వరకు పలు యూరోపియన్‌ దేశాలలో షూటింగ్స్‌ చేసిన మహేష్‌ 'స్పైడర్‌' కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌తో రొమేనియాలో రొమాన్స్‌ చేయనుండటం విశేషం. ఈ పాటలో రకుల్‌,మహేష్‌ల మద్య కెమిస్ట్రీ అద్బుతంగా ఉంటుందని అంటున్నారు. అయినా ఈ చిత్రం కోసం ఒకే ఒక్క పాట రొమేనియాలో తీయడం కంటే విదేశాలలో చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌లే ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయని,విదేశాలలోని యాక్షన్‌ సీక్వెన్స్‌లు అదిరిపోయేలా ఉంటాయంటున్నారు. 

మొత్తానికి 8వ తేదీ వరకు అక్కడ పాట ముగించుకుని తన పుట్టిన రోజైన 9వ రోజున టీజర్‌ విడుదలకు హైదరాబాద్‌లో ఫ్యాన్స్‌ మద్య సెలబ్రేషన్స్‌ చేసుకుంటాడో లేక తన ఫ్యామిలీతో పర్సనల్‌గా తన బర్త్‌డేని సెలబ్రేట్‌ చేసుకుంటాడో మాత్రం ఇంకా తెలియరాలేదు..! 

Pawan Kalyan in Bulgaria and Mahesh in Romania:

Mahesh Babu to shoot final song in Romania.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs